Tuesday, April 23, 2024

మేరీకోమ్‌కు పద్మవిభూషణ్

- Advertisement -
- Advertisement -

Mary Kom

 

న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్‌కు దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించారు. తెలుగుతేజం, భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధుకు మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. భారత క్రీడా రంగంలో వీరి ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన పురస్కారాలతో సత్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు శనివారం ప్రకటించిన పద్మా అవార్డుల్లో వీరికి ఈ గౌరవం దక్కింది. ప్రపంచ మహిళల బాక్సింగ్‌లో మేరీకోమ్ అత్యున్నత బాక్సర్‌గా నిలిచింది. రికార్డు స్థాయిలో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అంతేగాక పలు ఆసియా, కామన్వెల్త్ తదితర క్రీడల్లో కూడా పతకాలు సాధించింది. అసాధారణ ఆటతో ప్రపంచ బాక్సింగ్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగుతున్న మేరీకోమ్‌కు దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారంగా పరిగణించే పద్మవిభూషణ్‌తో సత్కరించాలని ప్రభుత్వం భావించింది. తాజాగా ప్రకటించిన పద్మా అవార్డుల్లో మేరీకోమ్‌కు ఈ అరుదైన గౌరవం లభించింది.

Padma Vibhushan to Mary Kom
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News