Home తాజా వార్తలు పద్మావతి న్యూ లూక్ పోస్టర్

పద్మావతి న్యూ లూక్ పోస్టర్

deepika
న్యూఢీల్లీ: వివాదాలతో నిత్యం వార్తల్లో నలుగుతున్న పదావతి తాజా పోస్టర్‌లో దీపికా పడుకునే కట్టిపడేసే రూపంతో ఆకట్టుకుంటోంది. రాజ్‌పుట్ మహిళల నడుమ రాజసం ఒలకబోస్తూ నిలుచున్న దీపికా రాణి పదిని పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు. గులాబీ చోళీ, ఎరుపు లెహెంగాలో దీపికా పడుకునే పోస్టర్‌లో రాచఠీవితో దర్మనమిచ్చారు. మరోవైపు పదావతి చిత్ర విడుదల నిలిపివేయాలని రాజ్‌పుట్ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. చిత్ర విడుదలకు ముందు చిత్రన్ని ప్రదర్మించాలని లేకుంటే థియేటర్లను దగ్దం చేస్తామని హెచ్చరించారు. రాణి పద్మిని పాత్రను అవమానంగా చిత్రించారని రాజ్‌పుట్‌లు అందోళన చేస్తున్నారు. చరిత్రను వక్రీకరిస్తే చిత్ర యూనిట్‌కు గట్టిగా బుద్దిచెబుతామని ఆందోళనకారులు హెచ్చరించారు. కాగా పద్మవతి చిత్రం డిసెంబర్ 1న విడుదల కానుంది.