Home జాతీయ వార్తలు పాక్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియంలో అభినందన్ బొమ్మ

పాక్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియంలో అభినందన్ బొమ్మ

Abhinandan

 

న్యూఢిల్లీ: భారత వాయుసేవ ఫైలెట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ బొమ్మను కరాచీలోని పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియంలో పెట్టారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ జర్నలిస్టు అన్వర్ లోధి ట్వట్టర్ లో తెలియజేశారు. అభినందన్ బొమ్మ చేతిలో టీ కప్పు పెడితే ఇంకా బాగుండేదని సరదాగా చమత్కారించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలాకోట్ లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడుల సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ యుద్ధ విమానాలను భారత సైన్యం ధీటుగా తిప్పి కొట్టింది. భారత వైమానికి దళానికి చెందిన మిగ్ 21 బైసన్ యుద్ధ విమానం కూడా కూలిపోవడంతో భారత పైలట్ అభినందన్ దురదృష్టవశాత్తు పాక్ భూభాగంలో పడిపోయారు. ఆయన్ని పాక్ ఆర్మీ ఆధీనంలోకి తీసుకుంది. మొదట రెండు భారత యుద్ధ విమానాలను కూల్చేశామని, ఇద్దరు పైలట్లను అదుపులోకి తీసుకున్నామని చెప్పిన పాకిస్థాన్.. తర్వాత మాట మార్చిన పాక్.. తర్వాత అభినందన్ వదిలేసిన సంగతి తెలిసిందే.

PAF has put mannequin of Abhinandan in museum