Tuesday, April 16, 2024

ఓటీటీలో ‘పాగల్’ డేట్ ఫిక్స్..

- Advertisement -
- Advertisement -

విశ్వక్ సేన్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర కియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం ‘పాగల్’. ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బెక్కెం వేణుగోపాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ చాలా క్లిష్ట పరిస్థితుల్లో మా ‘పాగల్’ సినిమాను విడుదల చేశాం. ప్రేక్షకులు ఈ సినిమాను చక్కగా ఆదరించడంతో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సినిమాను సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. నిర్మాతగా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక సెప్టెంబర్ 3న ఈ సినిమా ఓటీటీ వేదికగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతుంది. శాటిలైట్ హక్కులు కూడా అమ్ముడైపోయాయి. ఇక మధ్యతరగతి ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తేనే భారీ కలెక్షన్స్ ఉంటాయి. వాళ్లు లేకపోతే కలెక్షన్స్ అనుకున్నంతగా ఉండవు. ప్రస్తుతం – శ్రీవిష్ణు హీరోగా పోలీస్ ఆఫీసర్ బయోపిక్ తరహాలో ఓ సినిమాను చేస్తున్నాం. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని అనుకుంటున్నాం” అని అన్నారు.

Pagal Movie to Screen in OTT on Sep 3

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News