Saturday, April 20, 2024

తెలంగాణ కళాకారుల సేవలు మరుగున పడేశారు: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో గత  ప్రభుత్వాలు తెలంగాణ కళాకారుల సేవలు మరుగున పడేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. రవీంద్రభారతిలో దాదాసాహేబ్ పాల్కే అవార్డు గ్రహీత, బాలీవుడ్ మొట్ట మొదటి సూపర్ స్టార్ పైడి జయరాజ్ 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పైడి జయరాజ్‌కు మంత్రులు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ ఘనంగా నివాళులర్పించారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు కవులు, కళాకారుల జయంతి వర్ధంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. వివిధ భాషాల్లో 140 సినిమాల్లో పైడి కథానాయకుడిగా నటించారని గుర్తు చేశారు. సినిమాల్లోకి చాలా మంది నటులను తీసుకొచ్చారని, అమితాబ్ బచ్ఛన్ ను కూడా సినీ ఫీల్డ్ లో తీసుకొచ్చిన ఘనత పైడి జయరాజ్ కే దక్కుతుందన్నారు. దేశంలో పైడి జయ రాజ్ కు గుర్తింపు వచ్చిందని కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వాలు గుర్తించలేదన్నారు. పైడి జయరాజ్ పేరు మీద థియేటర్ కు పేరు పెట్టి గౌరవిస్తున్నామని, భవిష్యత్ లో చిత్ర పరిశ్రమలో ఆయన పేరు చిరస్థాయిలో  గుర్తుండే విధంగా కెసిఆర్ చేస్తారని మంత్రి హామీ ఇచ్చారు. జయరాజ్ కుటుంబ సభ్యుల సూచనలతో ముందుకు వెళ్తామని మంత్రి వెల్లడించారు. పైడి జయరాజ్ అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో సిరిసిల్లలో 1909 సెప్టెంబర్ 28న జన్మించారు. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు. పంజాబ్ కు చెందిన సావిత్రి అనే మహిళను పైడి వివాహం చేసుకున్నాడు. పైడికి ఇద్దరు కుమారులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News