Home అంతర్జాతీయ వార్తలు కుల్‌భూషణ్‌జాదవ్ రివ్యూ పిటిషన్‌కు వీలు కల్పించే బిల్లుకు పాక్ ఆమోదం

కుల్‌భూషణ్‌జాదవ్ రివ్యూ పిటిషన్‌కు వీలు కల్పించే బిల్లుకు పాక్ ఆమోదం

Pakistan approves bill allowing jadhav to appeal his conviction

 

ఇస్లామాబాద్: పాకిస్థాన్ కోర్టులో మరణశిక్ష పడిన భారతీయుడు కుల్‌భూషణ్‌జాదవ్‌కు రివ్యూ పిటిషన్ వేసుకునేంందుకు వీలు కల్పించే బిల్లుకు ఆ దేశ జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రిటైర్డ్ నావీ అధికారియైన జాదవ్‌పై భారత గూఢచారిగా అభియోగాలు మోపుతూ పాకిస్థాన్ కోర్టు 2017లో మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ కోర్టు(ఐసిజె) తీర్పు మేరకు పాకిస్థాన్ తమ దేశ చట్టాల్లో మార్పు చేసే బిల్లుకు ఆమోదం తెలిపింది. దాంతో, భారత్ ఆయన తరఫున న్యాయవాదిని నియమించే అవకాశం లభిస్తుంది. 2019 జులైలో ఐసిజె ఇచ్చిన తీర్పులోనూ ఈ అంశం ప్రస్తావించడం గమనార్హం. భారత్ తరఫున న్యాయవాదిని నియమించే వీలు కల్పించాలని ఐసిజె సూచించింది. తీర్పుపై పునఃసమీక్షించాలని పాకిస్థాన్ కోర్టును ఆదేశించింది. బిల్లుపై పాక్ న్యాయశాఖమంత్రి ఫరోగ్‌నసీమ్ మాట్లాడుతూ ఐసిజె తీర్పుమేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో, ప్రపంచానికి తమది బాధ్యతగల దేశమన్న సందేశమిచ్చామన్నారు.