Home అంతర్జాతీయ వార్తలు పాక్‌లో వరదల బీభత్సం: 57 మంది మృతి

పాక్‌లో వరదల బీభత్సం: 57 మంది మృతి

Pakistan-floodsఇస్లామాబాద్: పాక్‌లో ఎడతేరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటేత్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలశయాలను తలపిస్తున్నాయి. వదరదల ధాటికి ఇప్పటి వరకు 57 మంది మృత్యువాతపడ్డారు. మరో 27 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. పాక్‌లోని ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్, షాంగ్లా జిల్లాలు వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ బల్తిస్థాన్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి చిన్నారులతో సహా ఎనిమిదిమంది మృతిచెందారు. భారీగా వరదలు వస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదనీటి ధాటికి ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. పంట పోలాల్లో వరదనీరు భారీగా చేరడంతో పంటలు నీటమునిగి భారీ నష్టం వాటిల్లింది. వరదలు తగ్గుముఖం పట్టేవరకు అధికారులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు సమాచారం.