Home అంతర్జాతీయ వార్తలు జైలు నుంచి ఆస్పత్రికి నవాజ్ షరీఫ్

జైలు నుంచి ఆస్పత్రికి నవాజ్ షరీఫ్

Nawaz Sharifలాహోర్: అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, షరీఫ్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండడంతో వైద్యుల సూచన మేరకు ఆయనను జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు. శనివారం రాత్రి ఆయనను ఆస్పత్రిలో చేర్పించినట్టు ఆయన కుమార్తె మరియం నవాజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. హృద్రోగ సమస్యల కారణంగా నవాజ్ షరీఫ్ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో ఆయనను ఆస్పత్రికి తరలించాల్సిందిగా నిన్న పంజాప్ ప్రావిన్స్ ప్రభుత్వం ఆదేశించింది. అవినీతి కేసులో ఏడేళ్ల జైలుశిక్ష పడిన నవాజ్ ప్రస్తుతం కోట్‌ లఖ్‌పత్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

Pakistan Former PM Nawaz Sharif Taken To Hospital