Home అంతర్జాతీయ వార్తలు ఆర్మీ విమానం కూలి 15 మంది మృతి

ఆర్మీ విమానం కూలి 15 మంది మృతి

plane-crashఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో సోమవారం సైనిక విమానం కూలిన ఘ‌ట‌న‌లో 15 మంది మృత్యువాత పడ్డారు. పాక్ లోని రావ‌ల్పిండి న‌గ‌రంలో ఉన్న ఓ రెసిడెన్షియ‌ల్ ప్రాంతంలో ఈ విమానం కుప్పకూలింది. ఈ ప్ర‌మాదంలో 5 మంది ఆర్మీ సిబ్బందితో పాటు ప‌ది మంది సాదరణ ప్రజలు మృతి చెందగా… మ‌రో 12 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. శిక్ష‌ణ విన్యాసాలు చేస్తున్న స‌మ‌యంలో విమానం కూలినట్టు తెలుస్తోంది. విమానం రెసిడెన్షియ‌ల్ ప్రాంతంలో కూల‌డంతో అనేక ఇళ్లు మంట‌ల్లో కాలిపోయాయి. మిలిట‌రీ విమానం ప్ర‌మాదానికి గురికావ‌డానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియాల్సిఉంది. సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.

Pakistan military plane crash 15 died