- Advertisement -
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని పుల్వామ జిల్లా త్రాల్ ప్రాంతంలో పోలీసులు ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. భద్రతా బలగాలపైకి గ్రనేడ్ విసిరేందుకు యత్నించిన ఉగ్రవాదిని పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాలు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు మరింత పటిష్టంగా నిఘాను చేస్తున్నాయి.
- Advertisement -