Home తాజా వార్తలు మళ్లీ బాదేశారు

మళ్లీ బాదేశారు

australia

కదం తొక్కిన వార్నర్, లబుస్‌చగ్నె
ఆస్ట్రేలియా 302/1, పాక్‌తో రెండో టెస్టు

అడిలైడ్: పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో, చివరి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు దిశ గా అడుగులు వేస్తోంది. శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 302 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్, స్టార్ ఆటగాడు మార్నుస్ లబుస్‌చగ్నే అజేయ శతకాలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరును నమో దు చేసింది. రెండు మ్యాచ్‌ల సిరీస్ లో ఆస్ట్రేలియా ఇప్పటికే 10 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. అడిలైట్ వేదికగా జరుగుతున్న డేనైట్ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఓపెనర్ జోయ్ బర్న్ ఆరంభంలోనే పెవిలియన్ చేరాడు. జోయ్ 4 పరుగులు మాత్రమే చేసి షాహిన్ అఫ్రిది బంతికి పెవిలియన్ చేరాడు.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన యువ సంచలనం లబుస్‌చగ్నెతో కలిసి మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు పాకిస్థాన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఒకవైపు వికెట్లను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీని విడగొట్టేందుకు పాక్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరు అద్భుత బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాను సురక్షిత స్థితికి చేర్చారు. ఇటు వార్నర్, అటు లబుస్‌చగ్నె కుదురు కోవడంతో ఆస్ట్రేలియా కుదురుకుంది. వీరిని ఔట్ చేసేందుకు పాక్ కెప్టెన్ తరచూ బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. ప్రమాదకరంగా మారిన ఈ జంటను విడగొట్టడం పాక్ బౌలర్ల వల్ల కాలేదు.

కీలక ఇన్నింగ్స్ ఆడిన వార్నర్, లబుస్‌చగ్నె సెంచరీలతో కదం తొక్కారు. అంతేగాక చివరి వరకు అజేయంగా నిలిచి ఆస్ట్రేలియాను పటిష్టస్థితికి చేర్చారు. అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన 228 బంతుల్లో 19 పోర్లతో వార్నర్ 166 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు లబుస్‌చగ్నె కూడా అజేయ శతకంతో తనవంతు పాత్ర పోషించాడు. పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న లబుస్‌చగ్నె 17 ఫోర్లతో 126 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. ఈ క్రమంలో వార్నర్, లబుస్‌చగ్నెలు రెండో వికెట్‌కు రికార్డు స్థాయిలో 294 పరుగులు జోడించారు. పాకిస్థాన్‌పై రెండో వికెట్‌కు ఆస్ట్రేలియాకు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం.

ఇద్దరు ఇద్దరే..

ఇక, ఈ సిరీస్‌లో వార్నర్, లబుస్‌చగ్నెలు సెంచరీలు చేయడం ఇది వరుసగా రెండోసారి కావడం విశేషం. తొలి మ్యాచ్‌లో కూ డా వార్నర్, లబుస్‌చగ్నెలు ఇదే జోరును కొనసాగించారు. కీలక సమయంలో అద్భుత సెంచరీలుతో జట్టుకు అండగా నిలిచారు. వార్న ర్, లబుస్‌చగ్నెలు భీకర ఫామ్‌లో కనిపిస్తున్నా రు. యాషెస్ సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమై న డేవిడ్ వార్నర్ పాకిస్థాన్‌పై మాత్రం విశ్వరూ పం చూపుతున్నాడు. పాక్ బౌలర్లను హడలెత్తిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. వార్నర్ మళ్లీ పూ ర్వ వైభవం సాధించడం ఆస్ట్రేలియాకు పెద్ద ఊరటగా చెప్పాలి.

వార్నర్ వంటి స్టార్ ఆటగాడిని కట్ట డి చేయడం పాక్ బౌలర్లకు శక్తికి మించిన పనిగా మారింది. వార్నర్ ఇదే జోరును కొనసాగిస్తే రా నున్న రోజుల్లో ఆస్ట్రేలియాకు ఎదురే ఉండదని చె ప్పొచ్చు. ఇక, యువ సంచలనం లబుస్‌చగ్నె కూ డా వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా సెంచరీతో క దం తొక్కాడు. పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న లబుస్‌చగ్నె వరుసగా రెండో శతకాన్ని నమోదు చేశాడు. తొలి మ్యాచ్‌లో కూడా లబుస్‌చగ్నె భారీ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్‌లో లబుస్‌చగ్నె 185 పరుగులు చేశాడు. మరోవైపు వార్నర్ తొలి టెస్టులో 154 పరుగులు సాధించాడు.

pakistan vs australia 2nd test match