Friday, April 19, 2024

పాక్ చేతిలో పరాభావం

- Advertisement -
- Advertisement -

Pakistan win by 10 wickets over India

టి 20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే కోహ్లీ సేనకు చేదు అనుభవం, మొదటిసారి భారత్‌పై విజయం

10 వికెట్ల తేడాతో భారత్‌పై పాక్ విజయం
కోహ్లీ ఒంటరి పోరు వృథా

దుబాయి: సూపర్ బ్యాటింగ్.. టైటిల్ ఫేవరేట్.. అద్భుతమైన బౌలింగ్ అంటూ అభిమానులను ఎంతో ఊరించి నరాలు తెగే ఉత్కంఠను కలగించిన భారత్ పాక్ మ్యాచ్ చివరికి యాంటీ క్లైమాక్స్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన దాయాది పాక్ చేతిలో పది వికెట్ల తేడాతో ఘోరంగా పరాజయం పాలయింది. భారత్ నిర్దేశించిన 152 పరుగుల లక్షాన్ని పాక్ వికెట్ నష్టపోకుండానే 17.5 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించిం ది. ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్ (79 నాటౌట్), కెప్టెన్‌బాబర్ ఆజమ్(69 నాటౌట్) భారీ బాగసామ్యంతో పాక్‌కు ఘన విజయాన్ని అందించారు. ఈ పరాజయంతో భారత్ దాయా ది పాక్‌పై ఇప్పటివరకు ఉన్న విజయాల రికార్డును చేజార్చుకుంది. టి20 ప్రపంచకప్ వేటను ఓటమితో ప్రారంభించిం ది. ఓ పసికూన తరాహాలో చిరకాల ప్రత్యర్థి చేతిలో పరాభవా న్ని ఎదుర్కొంది. భారత బౌలర్లు ఎవరు కూడా పాక్ బ్యాట్స్‌మెన్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపలేక పోయారు. దీనికి తోడు మంచు తేమ కూడా బౌలర్లకు పట్టు లేకుండా చేసింది.

అర్ధ సెంచరీతో ఆదుకున్న కోహ్లీ

అంతకు ముందు భారత్ 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసి పాక్ ముందు ఓ మోస్తరు లక్షాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే వరస దెబ్బలు తగిలా యి. ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ ఇద్దరూ ఘోరం గా విఫలమయ్యారు. షాహిన్ వేసిన తొలి ఓవర్‌లో రాహుల్ (0) ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ల ముందు దొరికి పోయా డు. అనంతరం కెఎల్ రాహుల్ (3) కూడా ఔటయ్యాడు. షాహిన్ వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్ చేరా డు. వరసగా రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియాను సార థి విరాట్ కోహ్లీ (57) ఆదుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్(11)తో కలిసి ఇన్నింగ్స్‌ను కాస్త చక్కదిద్దాడు. అయితే హస న్ అలీ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడడానికి ప్రయత్నించి సూర్యకుమార్ వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్ పంత్‌తో కోహ్లీ వేగంగా పరుగులు చేయడానికి ప్రయత్నించాడు. దూకుడుగా ఆడే క్రమంలో రిషబ్ పంత్ షాదాబ్ బౌలింగ్‌లో అతడికేక్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. పంత్ 39 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా(13), హార్దిక్ పాండ్య(11)లు స్కోరు పెంచే క్రమంలో ఔటయ్యారు. పాక్ బౌలర్లలో షాహిన్ 3, హసన్ అలీ రెండు వికెట్లు పడగొట్టగా, షాదాబ్ ఖాన్,హరీష్ రౌఫ్ తలా ఒక వికెట్ తీశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News