Home అంతర్జాతీయ వార్తలు ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను హతమార్చిన పాక్ పోలీసులు

ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను హతమార్చిన పాక్ పోలీసులు

Pakistani police kill three Lashkar-e-Taiba militants

లాహోర్: పాకిస్థాన్‌లో లష్కర్‌ఇఝాంగ్వీకి చెందిన ముగ్గురు ఉగ్రవాదుల్ని ఆ దేశ పోలీసులు హతమార్చారు. పంజాబ్ రాష్ట్రంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలం నుంచి రెండు గ్రెనేడ్లు, రెండు తుపాకులు,ఓ రైఫిల్, ఇతర మారణాయుధాలను జప్తు చేసినట్టు పోలీసులు తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదులకు గతేడాది ఆగస్టులో పంజాబ్‌లోని బాహావల్‌నగర్‌లో మొహర్రం నిర్వహిస్తున్న షియా ముస్లింలపై జరిగిన దాడిలో పాత్ర ఉన్నదని పోలీసులు తెలిపారు. ఆ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 50మందికిపైగా గాయపడ్డారు. లష్కరే ఉగ్రవాదుల సంస్థ సున్నీ ముస్లింలతో ఏర్పాటైంది. ఈ సంస్థ గతంలోనూ పాక్‌లోని షియాలపై పలు దాడులకు పాల్పడింది. 2013లో క్వెట్టాలో ఈ సంస్థ జరిపిన బాంబు పేలుళ్లలో 200మందికిపైగా హజారా షియాలు మరణించారు.