Friday, March 29, 2024

ఈనెల 24న పాలమూరు విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మహబూబ్ నగర్: ఈనెల 24న పాలమూరు విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న పాలమూరు విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరాజన్ హాజరు కానున్నట్లు పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎల్‌బి లక్ష్మీకాంత్ రాథోడ్ తెలిపారు. 3వ స్నాతకోత్సవ ఏర్పాట్లపై మంగళవారం ఆయన పాలమూరు విశ్వవిద్యాలయం సమావేశం మందిరంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈనెల 24న మధ్యాహ్నం 3వ స్నాతకోత్సవం నిర్వహించనున్నామని, ఈ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ విశ్వ విద్యాలయం ఛాన్సులర్ తమిళసై సౌందరాజన్ అధ్యక్షత వహిస్తారని, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బిజీ రావు స్నాతకోత్సవ ఉపన్యాసం చేయనున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా పిమెచ్‌డి చేసిన ఆరుగురికి పిహెచ్‌డి పట్టాల ప్రధానంతో పాటు, 75మంది విద్యార్ధులకు బంగారు పథకాలను, 2932 మంది పీజి, 30645 యుజి విద్యార్ధులకు డిగ్రీలు ప్రధాన చేయనున్నట్లు వెల్లడించారు. విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం 2014 నవంబర్ 29న జరిగిందని, ఈ సందర్భంగా 60 బంగారు పథకాలు, 7636 మందికి యుజి, పీజీ డిగ్రీలు ప్రధానం చేయడం జరిగిందని, రెండవ స్నాతకోత్సవం కోంస 2019 మార్చి 6న నిర్వహించడం జరిగిందని, ఈ సందర్భంగా 115 బంగారు పథకాలతో పాటు, 14675 పీజీ, యుజి డిగ్రీలు ఇచ్చిన్నట్లు తెలిపారు. పాలమూరు విశ్వవిద్యాలయం 2008లో ప్రారంభించగా అత్యున్నత విద్యా ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్తున్నామని, ముఖ్యంగా దశాబ్ధకాలంలో విశ్వ విద్యాలయం విద్యారంగంలో మౌలిక సదుపాయాలు అభివృద్ది, సంస్థాగత నిర్మాణ రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించిందని, పాలమూరు విశ్వవిద్యాలయం న్యాక్ గుర్తింపు మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసి వచ్చే ఏడాది నాటికి మళ్లీ న్యాక్ గుర్తింపునకు సిద్దమవుతున్నటుల వైస్ ఛాన్సులర్ వెల్లడించారు.

విశ్వవిద్యాలయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అభివృద్ది పనులకు ప్రయత్నాలు చేస్తున్నామని, బోధనతోపాటు, పరిశోధన, సౌకర్యాల కల్పన, సంస్థలు ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన, క్రీడల అభివృద్దికి కృషి చేస్తున్నామని, ఇటీవలే కేంద్ర బృందం కూడా విశ్వవిద్యాలయంలో పర్యటించి వెళ్లిందని తెలిపారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో 1800 మంది విద్యార్ధులు ఉన్నారని, 18 డిపార్ట్‌మెంట్లు పని చేస్తున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నుండి బాలికల హాస్టల్ కూడా ప్రారంభం కానున్నదని ఆయన వెల్లడించారు. విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్, లా కళాశాలల ప్రారంభానికి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించడం జరిగిందని, అంతేకాక ఫిజికల్ ఎడ్యుకేషన్‌ను కూడా ప్రతిపాదించామన్నారు. వచ్చే సంవత్సరం నుండి యోగా డిప్లమా కోర్సును విశ్వవిద్యాలయంలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 24న నిర్వహించనున్న 3వ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 7 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, అందరి సహాకారంతో ఈ స్నాతకోత్సవాన్ని జయప్రదం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News