Home తాజా వార్తలు రైతు సమన్వయ సమితి చైర్మన్, డైరెక్టర్‌గా పల్లా రాజేశ్వర్‌రెడ్డి

రైతు సమన్వయ సమితి చైర్మన్, డైరెక్టర్‌గా పల్లా రాజేశ్వర్‌రెడ్డి

Rythu samanvaya samithi

 

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ప్రభుత్వం రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, డైరెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో పల్లా మూడేళ్ళ పాటు కొనసాగుతారని స్పష్టం చేసింది. ఆయనకు క్యాబినెట్ మినిష్టర్ హోదాను కల్పిస్తున్నట్లుగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఆ హోదాలో ఆయన అటు ఎంఎల్‌సిగా, ఇటు చైర్మన్‌గా జీతభత్యాలు, అలవెన్స్‌లు తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది.

పల్లాను అభినందించిన సిఎం
రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా నియామకమైన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ముఖ్యంత్రి కెసిఆర్ అభినందించారు. ప్రగతి భవన్‌లో శుక్రవారం సిఎంను పల్లా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పల్లాకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి, రైతు రైతాంగాన్ని ఓ సంఘటిత శక్తిగా మార్చే సత్సంకల్పంతో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని కోరారు.

Palla as Chairman of Rythu samanvaya samithi