Thursday, April 25, 2024

రేపు ఎంఎల్ సిగా ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ప్ర‌మాణం

- Advertisement -
- Advertisement -

Palla Rajeshwar Reddy will be sworn in as MLC tomorrow

హైద‌రాబాద్ : నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ‌పట్టభద్రుల ఎంఎల్ సి ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. టిఆర్ఎస్ ఎంఎల్ సిగా ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి గురువారం ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. తెలంగాణ శాస‌న‌మండ‌లిలో ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రొటెం చైర్మ‌న్ భూపాల్ రెడ్డి.. రాజేశ్వ‌ర్ రెడ్డి చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మంత్రులు, ఎంఎల్ఎలు, ఎంఎల్ సిలు పాల్గొన‌నున్నారు. ఈ సంద‌ర్భంగా వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎంఎల్ సి ఎన్నికల్లో అఖండ విజయం చేకూర్చిన పట్టభద్రులకు, అద్భుత కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మిత్రులకు, శ్రేయోభిలాశులకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News