Thursday, April 25, 2024

మరోసారి… ‘పల్లా’ వైపే

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి జిల్లా పట్టభద్రులంతా మోగ్గు
పట్టభద్రుల నిర్ణయంతో
ఇతర అభ్యర్థులు
సర్వేలు అన్ని గులాబీ వైపు
గుండెల్లో గుబులు

Palla rajeswar reddy will win in MLC Elections

మనతెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టిఆర్‌ఎస్…ప్రస్తుత పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లోనూ ప్రభంజనాన్ని సృష్టించనుందని తాజాగా నిర్వహించిన పార్టీ అంతర్గత సర్వేలో వెల్లడైంది. చెబుతున్నట్లుగానే ఉమ్మడి నల్లగొండ, జిల్లా శాసనమండలి ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి అభ్యర్థి గెలవనున్నాడని. మూడు జిల్లా పట్టభద్రుల శాసనమండలి స్థానాల్లో టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గతంలో కంటె ఎన్నడూలేని రీతిలో ఘన విజయం సాధించనున్నాడని, ఓట్లను గులాబీదళం సా సర్వేల్లో తేలింది. నల్లగొండ, జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్ పార్టీ ఇటీవల సర్వే నిర్వహించింది. సర్వేలో టిఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికే పట్టంకట్టారు.

మరోసారి పల్లాకే పట్టం…

ఉమ్మడి నల్లగొండ, జిల్లాలో ఆదివారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఫలితాలు మాత్రమే ఉన్నాయి. సంస్థలు చేపట్టిన సర్వేలు రాజకీయపార్టీల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సర్వేలు టిఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికే పట్టభద్రులు పట్టం కడుతారని చెబుతుండగా, సర్వేలు అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థుల మధ్యే మొగ్గు చూపుతున్నారంటూ జోస్యం చెబుతున్నారు. ఇలా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సర్వేలు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తుండటంతో నేతలు కన్ఫూజన్‌కు గురవుతున్నారు. తాజాగా ప్రముఖ వ్యక్తులు, చేపట్టిన సర్వేలో పల్లాకే విజయావకాశాలు ఉన్నాయని వెల్లడించింది.

జోరు మీదున్న పల్లా..

మార్చి 14న ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో జరిగిన పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సత్తా చాటుతాడని ప్రముఖ జాతీయ మీడియాతో పాటు ఇతర సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. ఓ ప్రముఖ పట్టభద్రులంతా గులాబీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికే జై కొట్టినట్లు వెల్లడించింది. ఇది ఇప్పటికిప్పుడు చేసిన సర్వే కాదని ప్రతి వారం ట్రెండ్‌ను పర్యవేక్షించి, విడుదల చేసిన సర్వే ఫలితాలని పేర్కొంది. పాటు ఎప్పుడు లేని విధంగా ఈసారి పోలింగ్ శాతం పెరగడం కూడా పల్లా గెలుపుకి ముఖ్య కారణంగా చెపుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 50శాతం మంది ఓటర్లు పల్లా వైపే మోగ్గు చూపారు. 5,05,515 మంది ఓటర్లకు గాను 3,74,117 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంది పట్టభద్రులు ఓటును వినియోగించుకున్నారు. దీంతో ఈసారి ఓటర్ల శాతం భారీగానే పెరిగింది. పెరిగిన ఓటర్ల శాతం అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికే మొగ్గు చూపుతుందని సమాచారం.

పల్లాకు శ్రీరామ రక్షగా నిలిచిన కెసిఆర్ సంక్షేమ పథకాలు

ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం మూడు జిల్లాలో మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ సంస్థలు నిర్వహించింది. అయితే అందులో కొన్ని టెలిఫోన్ ఇంటర్వూ ద్వారా మరికొన్ని నేరుగా సర్వేచేసింది. మొత్తం 50శాతం మందికి శాంపిల్స్ తీసుకున్నట్లు సమాచారం అందింది. కెసిఆర్ అన్ని సామాజిక వర్గాల వారికి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే పల్లాకు మరోసారి ఎమ్మెల్సీ చేస్తాయని సర్వే తెలిపింది. ముఖ్యంగా కెసిఆర్ ప్రవేశపెట్టిన జీవితబీమా, బంధు పథకాలు సూపర్ హిట్ అవడమే కాకుండా, కోసం పీఆర్సీ, గత ఆరు సంవత్సరాల కాలంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి లాంటి నూతన ఉద్యోగులు నియమించడం, ఉద్యోగుల మనసులో కెసిఆర్ నిలిచిపోయారని సర్వే వెల్లడించింది.

ఎక్కువ పోలింగ్‌తో టెన్షన్…

ఉమ్మడి నల్లగొండ, పట్టభద్రుల ఎన్నికల్లో ఆశించిన స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో ఓటింగ్ నమోదు కావడం చర్చకు దారి తీసింది.ఉమ్మడి నల్లగొండ,వరంగల్,ఖమ్మం జిల్లాలో 5లక్షల 5వేల 516 మంది పట్టభద్రుల ఓట్లతెఓ 3లక్షల 74వేల 117 ఓట్లు పోలై 74 శాతం నమోదైంది.గత పట్టభద్రుల ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం భారీగ పెరిగింది.మొదట ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగానే సాగింది. కొద్దిగా తగ్గిన తిరిగి సాయంత్రం4గంటల వరకు 74శాతం భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది.పోలింగ్ ముగుస్తున్న సమయంలో ఓటింగ్ ఎక్కువగా జరగడం అనుమానాకు తావిస్తోంది. గంటలో ఏ కేంద్రంలో అనుకున్న స్థాయిలో ఓటర్ల లేకపోలేదని అనుకున్న..చివరికి పోలింగ్ కేంద్రాల వద్ద పట్టభద్రులంతా బారులుతీరి ఏకంగా 74 శాతం పోలింగ్ పెరగడమేనుక ప్రతిపక్ష పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు.పెరిగిన ఓట్లు ఎవరి కొంప ముంచుతుందోనన్న సందేహాలు అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News