Home జనగామ సబ్బండ వర్గాలకు అండగా ప్రభుత్వం

సబ్బండ వర్గాలకు అండగా ప్రభుత్వం

 Pallamathalli temple land pooja program

మన తెలంగాణ/బచ్చన్నపేట : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని రాజ్య సభ సభ్యులు బండా ప్రకాశ్, జనగామ ఎ మ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలు అన్నారు. ఆదివారం మండలంలోని కేశిరెడ్డిపల్లి గ్రామం లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లి దేవాలయ భూమి పూజ  కార్యక్రమం అనంతరం గ్రామ సర్పంచ్ బాలనర్సయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న విధానాన్ని చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయే లా అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్న ఘన త ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 70 ఎం డ్ల పాలనలో రైతులను ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదని కాని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలోనే రైతుకు మద్దతుగా నిలిచి పంటపెట్టుబడి సాయం అందించింది తెలంగాణ ప్రభుత్వమే అన్నా రు. రైతుబంధు పథకం క్రింద ఎకరాకు రూ.4వేల చొప్పున అందించిన ఘనత టీఆర్‌ఎస్‌దే అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్షంతో ముందుకెళ్ళడం జరుగుతుందన్నారు. పేద ఆడపడుచుల పెళ్లికు లక్షా ఒక వేయి పదహారు రూపాయలు కల్యాణలక్ష్మి పేరుతో అందించి పేదలకు కేసీఆర్ దేవుడయ్యారన్నారు. కరువు ప్రాంతమైన జనగామ నియోజకవర్గానికి గోదావరి జలాలతో చెరువులన్ని నింపి వ్యవసాయానికి నీరందించడంతోపాటు చెరువుల్లో చేపపిల్లలను వేసి ముదిరాజ్‌లకు ఉపాధి చూపించారన్నా రు. రాబోయో రోజుల్లో దళారుల ప్రమేయం లేకుండా ప్రతి చెరువులో ముదిరాజ్‌లే రోజువారీగా చేపలు పట్టుకొని అమ్ముకునే రోజులోస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి సహకారమందిస్తుందని అందులో భాగంగానే పెద్దమ్మతల్లి దేవాలయానికి రూ.12లక్షల నిధులు ఇవ్వడం జరిగిందని అన్నారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన తరువాత మొదటిసారిగా గ్రామానికి విచ్చేసిన బండా ప్రకాష్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బొడిగం చంద్రారెడ్డి, ఎంపీటీసీ బద్దిపడిగె గోపాల్‌రెడ్డి, గంగం సతీష్‌రెడ్డి, హరి ప్రసాద్, శ్రీనివాస్, రాజు, జావీద్, షబ్బీర్, తదితరులు పాల్గొన్నారు.