Friday, April 26, 2024

అమెరికా ఎన్‌ఎస్‌ఎఫ్ డైరక్టర్‌గా పంచనాధన్ బాధ్యతల స్వీకారం

- Advertisement -
- Advertisement -

Panchanathan takes charges as US NSF Director

 

వాషింగ్టన్ : ప్రఖ్యాత భారతీయ అమెరికా శాస్త్రవేత్త డాక్టర్ సేతురామన్ పంచనాధన్ అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్‌ఎస్‌ఎఫ్ )డైరక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అమెరికా లోని వైద్యేతర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలకు తగిన నిధులు సమకూర్చే సంస్థగా ఎన్‌ఎస్‌ఎఫ్‌కు తగిన గుర్తింపు ఉంది. అరిజోనా స్టేట్ యూనివర్శిటీ ప్రొఫెసర్‌గా ఉంటున్న 58 ఏళ్ల పంచనాధన్ నియామకాన్ని గత వారం సెనేట్ ఏకగ్రీవంగా నిర్ధారించింది.

ఇదివరకు ఈ సంస్థకు డైరక్టర్‌గా పనిచేసిన ప్రాన్స్‌కొర్డోవా పదవీకాలం గత మార్చితో పూర్తి కావడంతో అప్పటి నుంచి తాత్కాలిక డైరక్టర్‌గా వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ (ఒఎస్‌టిపి) డైరక్టర్ డాక్టర్ కెల్విన్ డ్రోయెజ్‌మెయిర్ పనిచేస్తున్నారు. ఆయన స్థానంలో ఇప్పుడు సేతురామన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవీ కాలం ఆరేళ్లు. ఈ సంస్థ వార్షిక బడ్జెట్ 7.4 బిలియన్ డాలర్లు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం అధికారికంగా పంచనాధన్ నియామకాన్ని ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News