Home భద్రాద్రి కొత్తగూడెం ఐదేళ్లకే మళ్లీ గండం

ఐదేళ్లకే మళ్లీ గండం

Panchayat Elections in July

మున్సిపాలిటీ పేరుతో స్థానిక సందడికి బ్రేక్
జూలైలో పంచాయతీ ఎన్నికలు
నీరుగారిన కొందరి ఆశలు
అలుముకుంటున్న నిస్తేజం

మన తెలంగాణ/భద్రాచలం : రాష్ట్రమంతా ఇప్పుడు ఒక్కటే చర్చ… అదే పంచాయితీ ఎన్నికలు, ఎప్పటికే అన్ని ప్రాంతాల్లో ఎన్నికలకు సంబంధించిన ఊహాగానాలు, గెలుపు ఓటములపై బేరీజులు, అభ్యర్థుల ఐదేళ్లకే మళ్లీ గండం ఎంపికపై ఆశావాహుల ఆరాటం వంటి కార్యక్రమాలు చోటు చేసుకుంటుండగా కొన్ని చోట్ల కుల గణనకు పెద్ద పీఠ వేస్తున్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున గిరిజన ప్రాంతాలు ఉండటం, పంచాయితీలు పెరగటంతో యువతకు ప్రాధాన్యత దక్కనుంది. అయితే పంచాయితీ పోరు జూలై నెలాఖరు నాటికి పంచాయితీ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో అంతటా సందడి వాతావరణానికి తెరలేస్తోంది. అయితే భద్రాచలం లో మాత్రం ఎలాంటి సడీ చప్పుడూ లేదు. భద్రాచలంతో పాటు సారపాకను మేజర్ పంచాయితీలుగా మార్చేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో ఎన్నికల హడావిడికి నిలిచిపోయింది.

ఐదేళ్లకే మళ్లీ గండం :- సుమారు 32 ఏళ్ల తర్వాత భద్రాచలం గ్రామపంచాయితీకి ఎన్నికలు జరిగాయి. సర్పంచ్‌ను ఇక్కడి ప్రజలు ఎన్నుకున్నారు. దీంతో భద్రాచలం గ్రామ పంచాయితీకి చక్కటి ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ ఐదేళ్లకే మళ్లీ ఎన్నికల గండం వచ్చిపండింది. 2014లో జరిగిన గ్రామపంచాయితీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అవకాశం దక్కింది. ఇప్పుడు టిఆర్‌ఎస్ పార్టీలో ఉన్న జిల్లా నేతలంతా అప్పుడు టిడిపిలో ఉండటంతో శ్వేత విజయం సునాయాసమైంది. ఆ తర్వాత వాళ్లంతా టిఆర్‌ఎస్ కండువాలు కప్పుకోవడంతో సర్పంచ్ శ్వేత సైతం దారిపట్టింది. పదవులు కోసం పార్టీలు మారుతూ కమీషన్ల కోసమే ఆరాపడుతున్నారని అంతా అనుకున్నారు. తీరా చూస్తే ఐదేళ్లకే మళ్లీ ఎన్నికల గండం వచ్చిపడటంతో మంచి పనైందంటూ అంతా చర్చించుకుంటున్నారు.

నీరు గారిన ఆశలు : భద్రాచలానికి అంతా ప్రత్యేకంతా ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు ఉంటారు. సుప్రసిద్ద రామాలయం ఉంది. నిత్యం భక్తుల రద్దీగా, శ్రీరామనవమి, ముక్కోటి వంటి ఉత్సవాలు వస్తే అంతా సందడే సందడి. దీంతో ఇక్కడి సర్పంచ్ పదవికి పలువురు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న సర్పంచ్‌కు దక్కుతున్న మర్యాదలు, అనేక ప్రత్యేక కార్యక్రమాలకు ప్రథమ పౌరురాలిగా దక్కుతున్న గౌరవాన్ని చూసి ఈసారి ఎలాగైనా సర్పంచ్ బరిలో ఉండాలని అనేక మంది అనుకున్నారు. కానీ పభుత్వ నిర్ణయంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది.

గతంలోనూ ఇదే సీన్ :- భద్రాచలం గ్రామపంచాయితీకి గతంలో అచ్చూ ఇలాంటి సీనే రిపీట్ అయింది. తొలినాళ్ల నుండి పంచాయితిగా కొనసాగుతున్న భద్రాచలాన్ని టౌన్‌షిప్‌గా మార్పు చేశారు. ఆ తర్వాత మున్సిపాలిటీ అన్నారు. దీనిపై ఇక్కడి గిరిజన సంఘాలు చట్టానికి వ్యతిరేకంగా పాలన సాగుతోందని న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో మళ్లీ సీన్ రివర్స్ అయ్యి గ్రామపంచాయి స్థానానికి చేరిపోయింది. 2010 నుండి గ్రామపంచాయితీ పాలనే సాగుతోంది. ఏజెన్సిలో స్థానిక సంస్థలపై ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలని రాష్ట్రపతి ఆమోదముద్ర అవసరం. ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా ప్రత్యేక అధికారాలతో పనిపూర్తి చేసేలా సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ప్రభుత్వం అనుకున్నట్లు ఇది మున్సిపాలిటిగా రూపాంతరం చెందింతే ఆశావాహులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పట్లో ఎటూ తేలని విధంగా తయారైంది.