Home తాజా వార్తలు స్రవంతి కుటుంబాన్ని ఆదుకోవాలి

స్రవంతి కుటుంబాన్ని ఆదుకోవాలి

suicide

 

కలెక్టరేట్ ముందు మృతదేహంతో పంచాయతీ కార్యదర్శుల ధర్నా

నాగర్‌కర్నూల్ : గుమ్మకొండ పంచాయతీ కార్యదర్శి స్రవంతి ఆత్మహత్యకు గ్రామ పంచాయతీలో పని వత్తిడే కారణ ం అంటూ జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో ర్యాలీగా తీసుకొని వచ్చి నాగర్‌కర్నూల్ కలెక్టర్ కార్యాల యం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు మాట్లాడుతూ స్రవంతి పనిభారంతోటే ఆత్మహత్యకు పాల్పడిందని దీనికి కారణం ప్రభుత్వం యంత్రాంగమే అని ఆమె కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని తండ్రి, తల్లి లేని ఆమె ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారని ఆమె కుటు ంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

స్రవంతి భర్త ఆరు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆమెకు గత మూడు నెలల క్రితం పంచాయతీకార్యదర్శిగా ఉద్యోగం వచ్చింది. ఆమె మృతితో పదేళ్ళ లోపు ఉన్న చిన్నారులు అనాథలుగా మారారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం గుమ్మకొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి స్రవంతి మూడు రోజుల క్రితం ఆత్మహత్యకి పాల్పడింది. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.

Panchayati secretary Sravanthi committed suicide