Home వరంగల్ పాండవుల గుట్టకు మహర్దశ పట్టనుందా.?

పాండవుల గుట్టకు మహర్దశ పట్టనుందా.?

Pandavula Hills One Of The  Tourist center in Warangal

మనతెలంగాణ/వరంగల్‌అర్బన్ ప్రతినిధి: ప్రాచీన చరిత్ర కలిగిన పాండవుల గుట్ట చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం తెలంగాణ ప్రభుత్వంలో తొలిసారిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ద్వారా వచ్చినట్లవుతుంది. నాలుగో విడత హరితహారం కార్యక్రమం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇక్కడి నుంచే ప్రారంభించినట్లయితే భూపాలపల్లి జిల్లా కేంద్రానికి కూతువేటు దూరంలోనే ఉన్న పాండవుల గుట్ట పర్యాటక కేంద్రం ఆ జిల్లాకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ గుట్టలు రేగొండ, వెంకటాపురం, ములుగు మండలాల సరిహద్దుల్లో ఉండడం వల్ల భూపాలపల్లి జిల్లాకే వన్నె తెచ్చే పర్యాటక కేంద్రంగా వర్ధిల్లే అవకాశం ఉంది. దీని చరిత్రను చూసినట్లయితే పాండవులు అరణ్యవాసం చేసిన సమయంలో భూపాలపల్లి జిల్లా రేగొండ మండల పరిధిలోని గుట్టలపై విడిది చేయడం వల్ల  ఆ గుట్టలకు పాండవుల గుట్టలుగా పేరొచ్చి నేడు ప్రాచుర్యంలో ఉంది. వాస్తవానికి ఈ గుట్టలపై భీముని పాదం ఉండడం అక్కడే ఒక కొలను ఉండడం వల్ల పాండవులు ఈ గుట్టపైనే నివాసం ఉన్నారనే చరిత్ర చెపుతుంటారు. సమైక్య పరిపాలనలో తెలంగాణలో ఇలాంటి చరిత్ర కలిగిన ప్రాంతాలు ఎన్ని ఉన్నా అవి మరుగున పడిపోయాయి. పాండవుల గుట్ట వందల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఆ గుట్ట మొత్తం కూడా మైనింగ్‌తో కూడిన భూములు ఉన్నాయి. గుట్టలో ఎక్కువ శాతం డోలమైట్, లాటరైట్, ఐరన్ ఓర్ లాంటి మైనింగ్ ఉండడంతో మైనింగ్వ్యాపారులు రెండు దశాభ్ధాల క్రితమై దీనిపై కన్నేసి ఉన్నారు. మైనింగ్ కోసం మైనింగ్ శాఖకు లీజు పొందడానికి వ్యాపారులు దరఖాస్తులు కూడా చేసుకున్నారు. అటవీ, రెవెన్యూ శాఖల పరిధిలో ఉన్న గుట్ట భూములు వారి అనుమతి రావాల్సి ఉండడం వల్ల వ్యాపారులకు లీజులు సకాలంలో రాలేదు. కొంత మంది గుట్టపైన విశాలంగా ఉన్న 40 ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంటను కూడా గతంలో సాగు చేసి పాండవుల గుట్టను కబ్జా చేసే ప్రయత్నం చేయగా అధికారులు దానిని అడ్డుకున్నారు. అప్పటి నుంచి అటువైపు మైనింగ్ వ్యాపారులు ఎవరు కూడా అడుగు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఎంతో చరిత్ర కలిగిన పాండవుల గుట్ట చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో స్థానిక ఎంఎల్‌ఎ, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గతంలోనే ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. అందులో భాగంగానే పాండవుల గుట్టల ప్రాం తంలోనే హరిత హోటల్ నిర్మాణం జరిగి ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కెసిఆర్ నాలుగో విడత హరిత హారం కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించేదుంటే పాండవుల గుట్ట పర్యాటక అభివృద్ధికి మహార్దశ పట్టనుంది. పాండవుల గుట్ట దా ని చరిత్ర భవిష్యత్తు తరాలకు అందించేందుకు నిదర్శనంగా ఉండడమే కాకుండా పచ్చధనంతో పేర్చుకున్న కొండలు అందరిని ఆకర్షించే విధంగా ఉన్నాయి.
గతంలో పాండవులు మొన్న నక్సలైట్లు
రేగొండ, గణపురం మండల కేంద్రాల్లోని పాండవుల గుట్టలతో పాటు గణపురం మండలం మైలారం గ్రామ పరిధిలోని నల్లగుహలు(రాకాసి గుహలు) ఉన్న ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ నాలుగో విడత హరితహారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించడానికి జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని చరిత్ర పరంగా చూసినప్పుడు పాండవులు ఈ గుట్టలనే నివాస ప్రాంతంగా చేసుకొని అరణ్యంలో పాండవులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. 1990 నుంచి 1995 వరకు ఈ గుట్టలనే ప్రధాన స్థావరంగా మార్చుకొని పీపుల్స్‌వార్ నక్సలైట్లు సమాంతర ప్రభుత్వాన్ని నడిపించారు. నక్సలైట్లకు పెట్టిన కోటగా ఉన్న రేగొండ, చిట్యాల, ఏటూరునాగారం అడవులు వారి దళాలకు ఆయువుపట్టుగా ఉండి దశాబ్ధ కాలం పట్టు బిగించారు. నక్సల్స్ ఖిల్లాగా విరాజిల్లిన ప్రాంతాన్ని నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని అక్కడి నుంచే ప్రారంభించి ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేదుంటే భూపాలపల్లి జిల్లా ప్రజలకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులకు మరొక పర్యాటక కేంద్రం జోడి అవుతుంది. ఇప్పటికే భూపాలపల్లి జిల్లాలో లక్నవరం, రామప్ప, గణపురం సరస్సులతో పాటు బోగతా జలపాతాలతో పర్యాటకుల సందర్శన ఎక్కువ అవుతుంది. కొత్తగా ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాలని ఈ ప్రాంత ప్రజలు ముఖ్యమంత్రిని కోరుతున్నారు.
4వ విడత హరితహార కార్యక్రమం
భూపాలపల్లి : తెలంగాణ ప్రభుత్వం హరితహార నాలుగో విడుత కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు జిల్లాలో భూపాలపల్లిలో ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు శాసన సభాపతి స్పీకర్ సిరకొండ మధుసూదనాచారి తెలిపారు. జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి 4వ విడుత తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించే అవకాశం ఉన్నదని ఈ నేపధ్యంలో మంగళవారం శాసన సభా పతి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, జిల్లా కలెకట్ దుగ్యాల అమయ్ కుమార్, జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్‌లు ఘనపూర్ మండలంలోని మైలారం గ్రామ సమీపంలోని ప్రాంతంను, రెగొండ మండలంలోని ఘనపూర్ మండలంలోని మైలారం గ్రామ సమీపంలోని ప్రాంతంను రెగొండ మండలంలోని పాండవుల గుట్ట దగ్గర గల ప్రాంతాన్ని పరిశీలించి ముఖ్యమంత్రి 4 విడిత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అనువైన ప్రాంతంను అంచనా వేశారు. సిఎం మొక్కలను నాటడంతో పాటు భారీ బహిరంగ సభ కార్యక్రమం కూడా ఉండే అవకాశం ఉందని అందుకు తగ్గట్టుగా స్ధలాన్ని వాహనాలు తిరగడానికి రహదారి, పార్కింగ్ కు అనువైన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పరిశీలించారు ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణాలో పచ్చదనం పెంపునకు చేపట్టిన తెలంగాణ హరితహరం కార్యక్రమం 3 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహించబడుతుందని 4వ సంత్సరమైన ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 40 కోట్ల మొక్కలను నాటనున్నామని దీనిలో భాగంగా జిల్లాలో నాటుటకు ఒక కోటి 13 లక్షల మొక్కలను నర్సరీలలో సిద్దం చేశామని అన్నారు. 4 వ విడుత తెలంగాణకు హరితహారం కార్యక్రమంను భూపాలపల్లి జల్లాలో ప్రారంభించాలనే ఆలోచనలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారని అదేవిధంగా బహిరంగ సభను కూడ ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపారు. అందుకు అనువైన ప్రాంతం రెగొండ మండలంలోని పాండవుల గుట్ట వద్ద స్ధల పరిశీలన చేయడం జరిగిందన్నారు. ఇట్టి వివరాలను సిఎం కార్యాలయానికి పంపిస్తామిని సిఎం నిర్ణయం మేరకు స్ధలం ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ఘణపూర్ మండలం గాందీనగర్ ప్రాంతంలో కూడా సిఎం కార్యక్రమం కోసం స్ధలం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ పారెస్ట్ ఎంఎ అక్బర్, డిఎఫ్‌ఒ రవికిరణ్, ములుగు డిఎస్పీ రాఘవేందర్‌రెడ్డి, భూపాలపల్లి ఆర్‌డిఓ వీరబ్రమ్మచారి, ఘణపూర్ రేగోండ తహసిల్ధార్లు జీవాకర్ రెడ్డి, విఠలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.