Home కరీంనగర్ పర్యాటక కేంద్రంగా పాండవుల లొంక

పర్యాటక కేంద్రంగా పాండవుల లొంక

Pandavula-lanka

 కరీంనగర్ : మండలంలోని జాపర్‌ఖాన్‌పేట శివారులోని పాండవుల లొంక పర్యాట కేంద్రంగా విరజిల్లుతోంది. గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో గల ఈ పాండవుల లొంక పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. రామగిరిఖిలా నుండి వచ్చే జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. రామగిరి ఖిలాకు అతి సమీపంలో ఉన్న పాండవుల లొంక అనేక విశిష్టతను కలిగి ఉంది. రామగిరి ఖిలా నుండి వచ్చే నీటి ప్రవాహం పరుపు బండల పై నుండి జాలువారుతూ లోయగా ఉండే పాండవుల లొంకలో జలపాతం పడటం సందర్శకులకు ఆకర్షనీయంగా ఉంటుంది. పాండవులు వనవాసం చేసిన సమయంలో ఈ లొంకలో స్నానం చేసి శివాలయం లో పూజలు చేసినట్లు చెప్పుకుంటారు. జలపాతంలో భక్తులు స్నానం చేసి శివాలయంలో పూజలు నిర్వహిస్తారు. ఇటీవల గ్రామస్తులు ఆంజనేయ విగ్రాహన్ని ఏర్పాటు చేశారు. రవాణ సౌకర్యం లేక సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పాండవుల లొంకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుచున్నారు.