Home మహబూబ్‌నగర్ ఢీ అంటే ఢీ

ఢీ అంటే ఢీ

Pandidus wedding art with free weddings

జనార్ధనుల రేసులో దూసుకు పోతున్న మర్రి
జల యాత్రలకు జేజేలు
ప్రజామోద యోగ్యపనులు
ఉచిత వివాహాలతో పేదింట పెండ్లికళ

మన తెలంగాణ/మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఇద్దరు జనార్దన్ రెడ్డిల మధ్య జరుగుతున్న రాజకీయపోరు జిల్లా వ్యాప్తంగా రాజకీయం గా ఆసక్తికరంగా మారింది. వారిలో ఒకరు సీనియర్ నేత, మాజీ మంత్రి ఇటీవలే వివాదాల మధ్య కాంగ్రెస్‌లో చేరిన నాగం జనార్దన్‌రెడ్డి కాగా మరొకరు నియోజకవర్గంలో ప్రజల అభిమానం చూరగొంటున్న యువనేత మర్రి జనార్దన్‌రెడ్డి. జిల్లాలోనే గాక రాష్ట్రంలో కూడా పేరున్న సీనియ ర్ నాయకుడు నాగంతో యువ నాయకుడుమరు్రఇ జనార్ధన్‌రెడ్డి కెసిఆర్ పథకాలు తోడురాగా తన యువ మేధస్సుకు మెరుగులు దిద్దుకుంటూ ఢీ అంటే ఢీ అన్నట్లు వేగంగా రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నారు.
యాత్రలతో జోష్
అందని ద్రాక్షలా వున్న కెఎల్‌ఐ ప్రాజెక్టు నీటిని అందిస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని అక్షరాల అమలు చేస్తూ నియోజకవర్గ రైతులు సాగునీటి కలలు సాఫల్యం చేసి మర్రి జనార్దన్‌రెడ్డి ప్రజల నోట జేజేలు కొట్టించుకున్నారు. కెఎల్‌ఐ ప్రాజెక్టు విషయంలో తానే రూపకల్పన చేసిందని నాగం, తామే 90శాతం పనులుచేశామంటూ కాంగ్రెస్ నేతలు క్లైమ్ చేసుకునే యత్నాన్ని తిప్పి కొట్టి టిఆర్‌ఎస్ వల్లే జల కళ సాధ్యమైందన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రజల్లో నెలకొల్పడంలో మర్రి సఫలీకృత మయ్యారు.కెఎల్‌ఐ నీటి విడుదలలో లోపాలను సరిదిద్దేందుకు అధికార గణంతో మర్రి చేపట్టిన జల విజయయాత్రకు జనం జేజే లు పలికారు. వివిధ కారణాలతో సమయానికి నీరు అందని చేట్ల కాల్వల తవ్వకానికి , ఇతర అడ్డంకులకు ఎస్టిమేట్లు, మంజూరి తదిర అంశాల ప్రతిబంధకాలను అధిగ మించేందుకు తన స్వంత ఖర్చుతో రైతులకు నీరందించేందుకు పూనుకుని ఎక్కడికక్కడ కెఎల్‌ఐ నీటి తో తన పరపతిని సాగుచేసుకున్న ఘనత కూడా మర్రికే దక్కనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నియోజక వర్గ కేంద్రంలో ప్రజల ఆహ్లాదంకోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేసరి సముద్రం మిని ట్యాంకు బండు పనులు, స్వంత ఖర్చుతో బుద్ద విగ్రహం ఏర్పాటు ,పట్టణ ప్రధాన రహదారిలో డివైడర్ మాత్రమేగాక పూలు ఇతర మొక్కలతో ఏర్పాటు చేసిన పచ్చదనం నిత్యం ప్రజల మనసు దోచే విధంగా ఉన్నాయి.
పేదింటోల్లకు పెద్దింటోళ్ల పెండ్లికళ
మరోవైపు గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్న ఉచిత వివాహాలతో పేదింటిలో పెండ్లికళ తెస్తూ వారి కళ్లలో ఆనందం కలిగేలా చేస్తూ సామాన్యుల గుండెల్లో గూడు కట్టుకుంటూ తన గ్రాఫ్ ను పెంచుకున్నారు మర్రి. తాను రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత తను ఏర్పాటు చేసిన ఎంజెఆర్ ట్రస్టు ద్వారా చేస్తున్న ఇతర సేవా కార్యక్రమాలలో అగ్రగణ్యంగా నిలిచింది ఉచిత వివాహాల యజ్ణం. మొక్కు బడిగా సామూహిక వివాహాలు చేయడం కాకుండా పేదింటి పిల్లలు కూడా పెద్దింటి ఆడ బిడ్డల చేతకూడా రోజుల కొద్ది సంబరాలు జరిగేలా ఆయన చేపట్టిన బృహత్ కార్యక్రమం కూడా పేదింటి గుండెల్లో చిరస్దాయిగా నిలిచి పోనుందన్న భావన సర్వత్రా వ్యక్త మవుతున్నది. ఆయన చేపట్టిన అభివృద్ది పనుల్లో పర్యావరణం, ఆహ్లాదకర కార్యక్రమాలెన్నో ప్రజలను ఆకర్షిస్తున్నాయి.