Home ఆంధ్రప్రదేశ్ వార్తలు వలకు 175 కిలోల పండుగొప్ప

వలకు 175 కిలోల పండుగొప్ప

Pandugappa

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలో 175 కిలలో బరువు ఉన్న పండుగొప్ప వలకు చిక్కింది. పండుగొప్ప పడిందని తెలియగానే గ్రామస్థులు ఎగబడ్డారు. పండగప్పను ముక్కలుగా కోసి వాటాలు వేసుకున్నారు. ఒక్కొక్క వాటా మూడు కిలోల చొప్పున తీసుకున్నారు. ఒక్క వాటా ఖరీదు 500 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. ముందుగా వచ్చిన 70 మంది చేప మాంసాన్ని తీసుకెళ్లారు. మిగిలిన వారు నిరాశతో వెనుదిరిగారు. అక్కడి గ్రామస్థులు పండుగొప్ప పడిందంటే చాలు పండుగ చేసుకుంటారు.

 

Pandugappa Fish Hunting in Lake in East Godavari