Home హైదరాబాద్ చదువుల్లో రాణించడంలేదంటూ కొడుకుపై తండ్రి కర్కశత్వం

చదువుల్లో రాణించడంలేదంటూ కొడుకుపై తండ్రి కర్కశత్వం

Father-beet-son

మనతెలంగాణ/జవహర్‌నగర్: కుమారుడు చదువులో రాణించలేకపోతున్నాడని ఉపాధ్యాయులు తరుచూ ఫిర్యాదు చేస్తుండటంతో ఆ అవమానం భరించలేక తండ్రి తన కుమారుడిని విచక్షణారహితంగా కొట్టి గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించిన సంఘటన బుధవారం జవహర్‌నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని కౌకూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కౌకూర్ భరత్‌నగర్‌లో పెయింటర్‌గా పని చేస్తున్న బొర్ర ప్రహ్లాద్ (47) కుమారుడు బొర్ర శివమణి (14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కుమారుడు చదువులో అంతగా రాణించడం లేదని గతంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతుండగా ఉపాధ్యాయుల ఫిర్యాదుతో తండ్రి ప్రభుత్వ పాఠశాలలో చేర్చాడు. కాని కుమారుడు చదువులో అంతగా రాణించకపోవడంతో అతనిపై తండ్రి బెదిరింపులకు పాల్పడటమే కాక తీ వ్రంగా మందలించేవాడు. అయినప్పటికీ చదువులో మార్పు లే కపోవడం ఉపాధ్యాయుల ఫిర్యాదుతో కుమారుడిపై కోపగించు కున్నాడు. బుధవారం భార్య స్రవంతి బయటకు వెళ్లడంతో  కు మారుడిపై చదువు విషయంపై ఆరాతీసి కోపంతో పిడి గుద్దులు గుద్దడంతో చిన్నారి పెదవులు తీవ్రంగా కంది పోయాయి. అం తటితో ఆగక బెల్టుతో విచక్షణారహితంగా కొట్టడంతో పాటు గొంతు నలిమి చంపేందుకు ప్రయత్నించాడు. బాలుడి ఆర్తనాదాలతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి తండ్రిని అడుకున్నారు. సమాచారం తెలుసుకొని ఇంటికి వచ్చిన తల్లి స్రవంతి  స్థానికుల స హకారంతో జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.