Wednesday, April 17, 2024

కరోనాకు తల్లిదండ్రులు బలి… అనాథలుగా పిల్లలు

- Advertisement -
- Advertisement -

Parents dead with corona virus

పెద్దపల్లి: కరోనా కాటుకు తల్లిదండ్రులు బలికావడంతో పిల్లలు అనాథలుగా మారిన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటలో జరిగింది. ముత్తారం మండలం అడవి శ్రీరామ్ పూర్ గ్రామంలో మల్లేష్(36), సృజన(34) అనే దంపతులు మెడికల్ షాపును నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మలేష్ మెడికల్ షాపులో ఉండడంతో రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం వస్తుంది. జ్వరం ఎంతకు తగ్గకపోవడంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. అతడి భార్యకు కరోనా పాజిటివ్ రావడంతో ఇద్దరు ఆస్పత్రిలో చేరారు. పిల్లలని నానమ్మ-తాత దగ్గర ఉన్నారు. వారం రోజుల్లో తిరిగి వస్తామని పిల్లలకు ఫోన్ లో తల్లిదండ్రులు చెబుతూ ఉండేవారు. ఇద్దరు ప్రైవేటు ఆస్పత్రిలో  చికిత్స తీసుకుంటున్నారు. అతడి వైద్యానికి ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చుకాగా సృజన వైద్యానికి రెండు లక్షల రూపాయల ఖర్చు అయింది. మల్లేష్ ఆరోగ్యం విషమించడంతో బుధవారం 3.30 నిమిషాలకు కన్నుమూశాడు. ఆయన మృతదేహాన్ని తీసుకొచ్చి దహన సంస్కారాలు చేస్తుండగానే భార్య చనిపోయింది. తల్లిదండ్రులను కోల్పోవడంతో పిల్లలు గుండెలు విలిసేలా రోదిస్తున్నారు. దీంతో శ్రీరామ్ పూర్, బేగంపేటలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News