Home లైఫ్ స్టైల్ చిన్నారులు జాగ్రత్త…

చిన్నారులు జాగ్రత్త…

Children

 

నగరాల్లో పిల్లలతో, కుటుంబంతో పదినిమిషాలు ప్రశాంతంగా వెళ్లి కూర్చునే చోటే కనిపించదు. సెలవులొస్తే పాత రోజుల్లో బంధువుల ఇళ్లకు, విహారయాత్రలకు వెళ్ళేవారు. ఇప్పుడు ఆ సెలవుల్లో కూడా కోచింగ్‌లు, పెద్దవాళ్లకి ఉద్యోగాలు, సెలవులు లేకపోవటాలు చాలా ఆటంకాల మధ్య షాపింగ్ మాల్స్ ఒక్కటే సరదాలు, సందళ్ల నిలయాలుగా ఉన్నాయి. సూపర్ మార్కెట్లు, మాల్స్ కాస్త పిల్లలతో తిరిగేందుకు, షాపింగ్ చేసేందుకు, ఏదైనా తినేందుకు, వీలైతే అక్కడ ఓ సినిమా చూసేందుకు ఇష్టపడుతున్నారు. చిన్నపిల్లలకు కూడా ఇవి హుషారుని ఇస్తున్నాయి.

ఇవ్వాల్టి సంస్కృతిలో కాంక్రీట్ భవనాల మధ్య ఈ మాల్సే పిల్లలకు ఆటస్థలాలు. ఒక్కసారి ఇక్కడే పిల్లల కోసం చిన్నచిన్న పార్టీలు, ఈవెంట్లు జరుపుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే ఈ మాల్స్ వినోద కేంద్రాలుగా ఉంటున్నాయి. కానీ భద్రతా ఏర్పాటు పెద్దగా ఉండవు. భద్రతా చర్యలు ఉన్నాయి. కానీ అవి పిల్లల కోసం ప్రత్యేకం ఏవీ ఉండవు. నాలుగైదు ఏళ్లలోపు పిల్లలతో ఇక్కడికి వస్తే సాయంత్ర వేళల్లో కాంతివంతమైన దీపాలు,అద్దాలతో షాపులు, చుట్టూ ప్రదేశాలు పిల్లలు ఆడుకునేందుకు వీలుగానే అనిపిస్తాయి. ఇక్కడే పిల్లల్ని కాస్త శ్రద్ధగా పట్టించుకోవాలి.

పిల్లలతో పాటు పెద్దవాళ్లు కూడా ఎంజాయింగ్ మూడ్‌లో ఉంటారు. చుట్టూ విండో షాపింగ్ చేస్తారు. కొనదలుచుకున్న వస్తువుల కోసం, ఇష్టమైన డ్రస్‌ల కోసం షాపులు వెతికేస్తూ ఉంటారు. పిల్లల విషయంలో కాస్త ఏమరపాటుగా ఉంటారు కూడా.

ఫ్లోర్ ప్లాన్‌లు మారొచ్చు: ఎన్నిసార్లు వెళుతున్నా మాల్ పట్ల పూర్తి అవగాహన ఉండదు. ఎందుకంటే చాలా సార్లు పాత షాపులు మూసేసి కొత్త వాటిని ఏర్పాటు చేయచ్చు. మాల్‌లో కొన్ని విభాగాల్లో మూసేసి రిపేరింగ్ వర్క్ జరుగుతూ ఉండచ్చు. మాల్ పరిసరాల్లో పిల్లలు కనుసన్నలతో ఉండకపోతే కష్టం. అలాగే మాల్స్ సుదీర్ఘమైన వాకింగ్ ఏరియా. ఎత్తైన సీలింగ్‌లు, మెట్లు, ఎలివేటర్లు.. ఇవన్నీ పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవలసిన సమస్యాత్మక ప్రదేశాలు. పెద్దవాళ్లు ఏ టెన్షన్ లేకుండా ఏదో ఒక దృక్పథంతో ఉంటారు. పిల్లలు పెద్దవాళ్ల చేతులు వదిలి అటూ ఇటూ వెళ్లాలని చూస్తారు.
అలాగే అన్ని చోట్ల లైటింగ్ ఒకేలాగా ఉండవు. డిమ్‌గా మ్యూటెడ్‌గా మూన్ లైటింగ్ ఉన్న చోట్ల నేరగాళ్లు పొంచి ఉండే అవకాశాలు ఉంటాయి.

ఆటోమేటిక్ డోర్స్ : తలుపుల పైన ఆటోమేటిక్ డోర్స్ కదలికలకు సంబంధించి స్విచ్‌లు ఉంటాయి. ద్వారం దగ్గరకు రాగానే అవి హఠాత్తుగా తెరుచుకుంటాయి. అక్కడకు పిల్లల్ని అసలు అనుమతించ కూడదు. తల్లిదండ్రుల చేతులు వదిలేసి పిల్లలు చలాకీగా డోర్ దాటి వెళ్లిపోవచ్చు. పిల్లల చేతులు పట్టుకుని ఈ డోర్స్‌లోంచి వెళ్ళాలి కానీ ఆ ప్రదేశాల్లో పిల్లల్ని ఒంటరిగా వదలవద్దు.

పార్కింగ్ ప్లేస్‌లు: కొన్ని మాత్రం లైటింగ్‌తో పార్కిం గ్ ప్లేస్‌లు ఉంటాయి. సాధారణంగా ఇవే నేరగాళ్లకు నెలవుగా ఉంటాయి. పెద్దగా భద్రతా ఏర్పాట్లు ఉం డవు. వెనక నుంచి ఇంకో వాహనం రావచ్చు. పిల్లలతో ఇలాంటి ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు పెద్దవాళ్ల కంటి చూపు పరదాలోనే ఉండాలి.

Parents should be Careful about Child