Home తాజా వార్తలు విద్యాసంస్థలకు సెలవులు పొడగింపు?

విద్యాసంస్థలకు సెలవులు పొడగింపు?

Parents want to extend sankranthi holidays in ts

 

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను పొడిగించే అవకాశం ఉంది. ఇప్పటికే కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సంక్రాంతి సెలవులను మూడు రోజుల ముందుగానే ఈ నెల 8 నుంచి 16 వరకు ఇచ్చారు. అయితే కేసులు తగ్గకపోవడంతో మరికొద్ది రోజులు విద్యార్థులకు సెలవులు ఇవ్వడమే మేలని వైద్యారోగ్య శాఖ సూచించినట్లు తెలుస్తుంది. దీంతో 20వ తేదీ వరకు రాష్ట్రంలో కరోనా ఆంక్షలు అమల్లో ఉంటాయని, సెలవులు కూడా పొడిగిస్తారనే సమాచారం. అయితే అప్పటి వరకు ఎటువంటి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకుడదని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాతనే ఏ విషయం అనేది వెల్లడిస్తామని విద్యాశాఖ పేర్కొంది. త్వరగా ప్రకటిస్తే పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి రావాలా? లేదంటే సెలవులు ముగిసే వరకు అక్కడే ఉండాలా? అన్న విషయంలో నిర్ణయం తీసుకుంటారని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

Parents want to extend sankranthi holidays in ts