Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఎపిలో పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దు

ఎపిలో పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దు

Parishad‌ Election Notification‌ Cancellation In APఅమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ను రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం చర్చనీయాంశమైంది. పరిషత్ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ లో  ఈ ఏడాది ఏప్రిల్ 8న పరిషత్ ఎన్నికలు జరిగాయి. పోలింగ్ జరిగినప్పటికీ, హైకోర్టు ఆదేశాలతో ఓట్లను లెక్కించలేదు ఈ నెల 4న ఈ అంశంపై కోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ క్రమంలో శుక్రవారం మరోమారు దీనిపై కోర్టు విచారణ చేసింది.  సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, పోలింగ్‌కు 4 వారాల ముందు నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న ఆదేశాలను పట్టించుకోలేదని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ క్రమంలోనే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. కొత్తగా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.