Wednesday, April 24, 2024

‘బుల్లెట్’ కేసులో విచారణకు హాజరైన పరిటాల సిద్దార్థ్

- Advertisement -
- Advertisement -
Paritala Siddhartha Bullet found Case
వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని డెడ్‌లైన్

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఈనెల 18వ తేదీ పరిటాల సిద్ధార్థ్ బ్యాగులో బుల్లెట్ లభ్యమైన కేసులో నోటీసులు జారీ చేయడంతో శనివారం శంషాబాద్ ఎసిపి ఎదుట పరిటాల ఆయన విచారణకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, టిడిపినేత పరిటాల సునీత చిన్న కుమారుడు సిద్దార్థ్ రెండు రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలో తన స్నేహితులలో శ్రీనగర్‌కు వెళ్తున్న క్రమంలో తూటాతో విమానాశ్రయ సిబ్బందికి చిక్కిన విషయం విదితమే. ఈక్రమంలో సిద్ధార్థ్ గతంలో పాయింట్ 32 క్యాలిబర్ గన్‌కు లైసెన్స్ పొందినట్టు విచారణలో తేలింది. కాగా సిద్దార్థ్ బ్యాగులో సాయుధ బలగాలు వాడే 5.56 క్యాలిబర్ బుల్లెట్ లభ్యమైనట్టు పోలీసులు గుర్తించిన పోలీసులు మాజీ మంత్రి పరిటాల సునీత చిన్న కొడుకు సిద్ధార్థ్ పోలీసుల విచారణకు 41సిఆర్‌పిసి ప్రకారం నోటీసులిచ్చి విచారణకు పిలిచారు. పోలీసులు, ఆర్మీ వాళ్ళ దగ్గర ఉండే ఆ బుల్లెట్ అతనివద్దకు ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చారన్న కోణంలో విచారించారు. ఆర్మ్‌డ్‌చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారం రోజుల్లో సమాధానం చెప్పాలని లేనిపక్షంలో చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News