Tuesday, April 23, 2024

సాగు చట్టాలను సాగనంపిన పార్లమెంట్

- Advertisement -
- Advertisement -

Parliament approves repeal of farm laws

రద్దు బిల్లుకు ఉభయ సభల ఆమోదం

కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ లోక్‌సభలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెడుతుండగా రైతులను కష్టాల పాలు చేయొద్దంటూ ప్లకార్డు ప్రదర్శిస్తున్న టిఆర్‌ఎస్ ఎంపి

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే సాగు చట్టాల రద్దు బిల్లు2021కి ఉభయసభలు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపాయి. ఉభయసభల్లోనూ సాగుచట్టాల రద్దుతోపాటు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)కు చట్టపరమైన హామీ కల్పించడంపై చర్చించా లని ప్రతిపక్షాలు పట్టుపట్టగా అందుకు అనుమతించలేదు. చట్టాలకు నిర సనగా ఏడాదికాలంగా సాగిన ఉద్యమంలో 700మంది రైతులు ప్రాణా లు కోల్పోయారని, వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కూడా ప్ర తిపక్షాలు డిమాండ్ చేశాయి. సాగుచట్టాలరద్దు బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మొదట లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా వీటిపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. లోక్‌సభ లో కాంగ్రెస్ పక్షం నేత అధిర్‌రంజన్‌చౌదరి బిల్లుపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని కూడా స్పీకర్ ఓంబిర్లా అంతకుముందే తిరస్కరించడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ప్రతిపక్షాల ఎంపిలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. బి ల్లుపై చర్చ జరగాలని నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. చర్చకు అనుమతించేందుకు తాను సిద్ధమేనని, అయితే, సభ అదుపులో ఉన్నపుడే అది సాధ్యమని ఈ సందర్భంగా ఓంబిర్లా సభ్యులకు సూచించారు. ప్రతిపక్షాల నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలి పింది. వెల్‌లో నిరసన తెలిపినవారిలో టిఆర్‌ఎస్, డిఎంకె, టిఎంసి ఎంపీలున్నారు. కాంగ్రెస్, ఎన్‌సి పి, బిఎస్‌పి, ఐయుఎంఎల్ సభ్యులు వారి స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. ఆ సమయంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, ధర్మేంద్ర ప్రధాన్, స్మృతి ఇరానీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోని యాగాంధీ, ఎస్‌పినేత ములాయం సింగ్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్‌అబ్దుల్లా సభలోనే ఉన్నారు. సాగుచట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమో దం తెలిపిన తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో చైర్మన్ స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కాంగ్రెస్‌పక్షం నేత మల్లికార్జున్ ఖర్గేకు సంక్షిప్తంగా మాట్లాడేందుకు అనుమతిచ్చా రు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పిన ఖర్గే.. ఈ సమయంలో నిర్ణయం తీసుకోవడానికి కారణం త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలేనని విమర్శించారు.

ఇటీవలి ఉప ఎన్నికల్లో అధికార బిజెపికి ఎదు రగాలి వీయడం వల్లేనని ఖర్గే అన్నారు. చట్టాల రద్దు కోసం ఆందోళన నిర్వహించిన సమయంలో మృతి చెందిన 700మంది రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చర్చకు అనుమతించకపోవడం పట్ల రాజ్యసభలో నూ ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. టిఎంసి సభ్యులు డోలాసేన్, నదిముల్‌హాక్ వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో చట్టాల రద్దు బిల్లుకు రాజ్య సభ ఆమోదం తెలిపింది. చట్టాల రద్దు బిల్లుకు ఉభయసభలు ఆమోదం తెలపడంతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ వద్దకు దానిని పంపించనున్నారు. రాష్ట్రపతి ఆమో ద ముద్రతో మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలు రద్దు కానున్నాయి.

అప్పుడూ.. ఇప్పుడూ అంతే

వివాదాస్పద సాగు చట్టాలకు ఆమోదం, రద్దు ఈ రెండు సందర్భాల్లోనూ మోడీ ప్రభుత్వం ఒకే పద్ధతిని అవలంభించింది. చట్టాలను రూపొందించినప్పుడు పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ లేకుండానే ఇరు సభల ఆమోదం తీసుకున్నారు. తాజాగా ఆ చట్టాలను రద్దు చేస్తున్న సమయం లో కూడా అదే వైఖరిని తీసుకున్నారు. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజునే సోమవారంనాడు చట్టాల రద్దు బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. అయితే ఎలాంటి చర్చ చేయకుండానే మూజువాణి ఓటింగ్ నిర్వహించి రద్దుకు ఇరు సభల ఆమోదం పొందారు. గత ఏడాది ఆగస్టులో సాగు చట్టాల బిల్లును లోక్‌సభలో, రాజ్యసభలో ప్రవేశ పెట్టినప్పుడు ఎలాంటి చర్చ లేకుండా ఓటింగ్ నిర్వహించి ప్రభుత్వం తన పట్టును నెగ్గించుకుంది.

అయితే ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్విరామ ఆందోళన చేపట్టారు. 2020 నవంబర్ 26న దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో చేపట్టిన ఆందోళన ఏడాది కాలంగా కొనసాగుతూనే ఉంది. మధ్యలో ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు చేసినప్పటికీ ఉపయోగం లేకపోయింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ వివాదాస్పంగా మారింది. అయినప్పటికీ రైతులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆందోళన కొనసాగించారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. మూడు సాగు చట్టాల్ని రద్దు చేస్తామని నవంబర్ 19న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News