Home తాజా వార్తలు గులాబీ బాస్ సభ ఏర్పాట్ల పరిశీలన

గులాబీ బాస్ సభ ఏర్పాట్ల పరిశీలన

భారీ జన సమీకరణ వైపు దృష్టి
నల్లగొండ పార్లమెంటుపై ప్రత్యేక దృష్టి
ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ముఖ్య నేతలు


మనతెంగాణ/నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సభ నిర్వహాణకు ఏర్పాట్లను జిల్లాలోని ముఖ్యనేతలు బుధవారం సమీక్షించారు. నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఈ నెల 16న నల్లగొండ సమీపంలోని బైపాస్ రోడ్డులోని ఎన్‌ఆర్‌ఎస్ గార్డెన్ సమీపంలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లను ఆ పార్టీ నేతలు చేస్తున్నారు. లక్ష మందితో సమావేశం నిర్వహించే లక్షంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నల్లగొండ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోని శాసన సభ నియోజకవర్గాల శాసన సభ్యులకు ఆయా నియోజక వర్గాల జన సమీకరణను అప్పగించారు. నల్లగొండ, హుజుర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, నాగార్జున సాగర్, కోదాడ నియోజక వర్గాల నుంచి భారీగా జన సమీకరణను చేసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నల్లగొండలో కాంగ్రెస్ ఓటరు శాతం ఎక్కువగా వుందన్న ఉహాగానాలతో ఎక్కువ సంఖ్యలో జనాన్ని సమీకరణ చేయాలని టిఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లను చేయాడంలో నిమగ్నమయ్యారు.

ఎన్నికల సన్నాహక సభకు జిల్లానేతలతో పాటు రాష్ట్రం నుంచి భారీగా నేతలు తరలి వచ్చే అవకాశం వుండటంతో సమావేశం నిర్వహించు స్థలం వద్ద భారీ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. 100 మంది కూర్చునే విధంగా వేదికను తయారు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి, తుంగతుర్తి శాసన సభ్యులు గాధరి కిషోర్‌కుమార్, ఎఫ్ డిసి చైర్మన్ బండా నరేంధర్‌రెడ్డి తదితరులు వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినంద వలన సన్నాహక సమావేశాలను నిలిపే సూచనలు కనబడుతున్నాయి. నల్లగొండ పై ముఖ్యమంత్రికి ప్రత్యేక దృష్టి వుండడంతో ప్రకటించిన ప్రకారం సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. సన్నాహక సమావేశం నల్లగొండదే చివరిది అయ్యే అవకాశం వుంది.

 

కెటిఆర్ సభను విజయవంతం చేయాలి: కంచర్ల

నల్లగొండ పార్లమెంటు సన్నాహక సభను విజయవంతం చేయాలని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. బుదవారం స్థానిక నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కెటిఆర్ సమావేశానికి భారీగా జనం తరలి వచ్చి కెసిఆర్‌కు మద్దతు తెలుపాలని కోరారు. దేశంలో ఎక్కడ చేయని అభివృద్ధిని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్నడని స్పష్టం చేశారు. కెసిఆర్ పాలనను చూసిన ఇతర దేశాల, రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేస్తున్నరని అన్నారు. కెటిఆర్ సభకు లక్ష మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కొందరు రైతులు, పింఛన్‌దారులు స్వచ్చందంగా సమావేశానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరేందుకు ముందుకు వస్తున్నరని వివరించారు. కెటిఆర్ సమక్షంలో పార్టీలోకి వలసలు భారీ సంఖ్యలో జరుగుతున్నాయని, సమావేశంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేంధర్‌రెడ్డి, తుంగతుర్తి శాసన సభ్యుడు గాధరి కిషోర్‌కుమార్, నలమోతు భాస్కర్‌రావు, నాయకులు మల్లేష్‌గౌడ్, అబ్బగోని రమేష్‌గౌడ్, గోలి అమరేందర్‌రెడ్డి, మాలే శరణ్యరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

Parliament Elections: KCR Meeting in Nalgonda