Friday, April 26, 2024

జూలై 19నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

- Advertisement -
- Advertisement -

జూలై 19నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
ప్రభుత్వానికి కేబినెటల్ కమిటీ సిఫార్సు
ఆగస్టు 13 దాకా కొనసాగే అవకాశం
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 19న ప్రారంభం అయ్యే అవకాశముంది. పార్లమెంటు సమావేశాలు జూలై 19 ఆగస్టు 13 వరకు నిర్వహించాలని పార్లమెంటు వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపారు. దాదాపు నాలుగు వారాల పాటు కొనసాగే ఈ సమావేశాల్లో ఉభయ సభలు 20 రోజుల పాటు సమావేశ మవుతాయి. కొవిడ్ కారణంగా అత్యవసరం నిమిత్తం కొన్ని సందర్భాల్లో మినహా గత ఏడాదిన్నర కాలంగా పార్లమెంటు సమావేశాలు సరిగా జరగలేదు. 2021 బడ్జెట్ సమావేశాలు కూడా తక్కువ సమయంలోనే ముగించడంపై ప్రతిపక్షాలనుంచి అనేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సారి సమావేశాలను కాస్త అటూ ఇటుగా నాలుగు వారాలు నిర్వహించడానికి పార్లమెంటు కమిటీ సిఫార్సు చేసింది. ఇక పార్లమెంటులో కూడా కొవిడ్ నిబంధనల ప్రకారం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది.

Parliament monsoon session begin from July 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News