Home జాతీయ వార్తలు ఎంపిల వేతనాల్లో కోత బిల్ల్లుకు రాజ్యసభ ఆమోదం

ఎంపిల వేతనాల్లో కోత బిల్ల్లుకు రాజ్యసభ ఆమోదం

Parliament nod to bill to cut MPs salaries

 

ఎంపిలాడ్స్ నిధుల నిలిపివేతపై ప్రతిపక్ష సభ్యుల అసంతృప్తి

న్యూఢిల్లీ: కొవిడ్19 మహమ్మారి కారణంగా తలెత్తిన అవసరాలను తట్టుకోవడం కోసం ఏడాది పాటు పార్లమెంటు సభ్యుల జీతాల్లో 30 శాతం కోత విధించడానికి ఉద్దేశించిన బిల్లుకు శుక్రవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు కు రాజ్యసభ మూజువాణి ఓటుద్వారా ఆమోదం తెలిపింది. గత ఏప్రిల్‌లో కేంద్రమంత్రివర్గం ఆమోదించి జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఏడాది పాటు మంత్రుల వేతనాలు అలవెన్సుల్లో 30శాతం కోత విధించడానికి ఉద్దేశించిన మంత్రుల వేతనాలు, అలవెన్సుల (సవరణ) బిల్లు, 2020ని కూడా ఎగువ సభ ఆమోదించింది. హోం శాఖ సహాయమంత్రి జి కిషన్ రెడ్డి మంత్రుల వేతనాలు, అలవెన్సుల సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఏకకాలంలో రెండు బిల్లులను పరిశీలనకు స్వీకరించిన సభ మూజువాణి ఓటుతో వాటిని ఆమోదించింది.

కాగా బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యుల వేతనాల్లో కోతను ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు కూడా సమర్థిస్తూ, ఎంపిలాడ్ పథకాన్ని రెండు సంవత్సరాల పాటు నిలిపి వేయాలన్న నిర్ణయాన్ని తిరిగి సమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఇది తాత్కాలిక నిలిపివేత మా త్రమేనని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. కాగా సభ్యు ల వేతనాల్లో కోత వల్ల ఎంత సొమ్ము ఆదా అవుతుందనేది ముఖ్యం కాదని, వేతనాలు తగ్గించుకోవాలని ఇతరులను కోరే ముందు ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులు ఈ విషయంలో ఇతరులకు ఆదర్శంగా ఉండాలన్నదే దీని ఉద్దేశమని చర్చ సందర్భంగా మంత్రి చెప్పారు. డిఎంకె సభ్యుడు చెప్తున్నట్లుగా ఆదా అయ్యే మొత్తం 4 కోట్లు కాదని, ఏడాదికి రూ. 53.9 కోట్లు ఆదా అవుతుందని ఆయన అన్నారు. అంతకు ముందు డిఎంకె సభ్యుడు పి విల్సన్ మాట్లాడుతూ ఎంపిల వేతనాల్లో కోత వల్ల కేవలం నాలుగు కోట్లు మాత్రమే ఆదా అవుతుందన్నారు.

కాగా ఖర్చులు తగ్గించడానికి బులెట్‌ట్రైన్ లాంటి ప్రాజెక్టులను, పార్లమెంటు కొత్త భవన నిర్మాణాన్ని ఆపేయాలని పలువురు ప్రతిపక్ష సభ్యులు కోరగా, ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలని ఇంతకు ముందు మీరే చెప్పారని, ఇప్పుడేమో ఈ ప్రాజ్టెలన్నిటినీ ఆపేయాలని అంటున్నారనిస్పందించిన మంత్రి అన్నారు. కాగా ఎంపిలాడ్ నిధులు అనేవి తమ నియోజకవర్గాల ప్రజల అవసరాలు తీర్చడానికి ఉద్దేశించినవని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ అంటూ వీటిని రెండేళ్లపాటు నిలిపివేయడం సరికాదన్నారు. ఒక వేళ ప్రభుత్వం నిలిపి వేయాలనుకుంటే ఏడాదికి తగ్గించాలని, అలాగే నిధులను ఏడాదికి రూ.2.5 కోట్లకు పరిమితం చేయాలని ఆయన సూచించారు. వివిధ పార్టీలకు చెందిన సభ్యులు కూడా ఆజాద్ సూచనకు మద్దతు తెలిపారు. కాగా అంతకు ముందు రెండు బిల్లుల్లోని అంశాలు ఒకటేగనుక రెండు బిల్లులపై ఒకేసారిచర్చిస్తే బాగుంటుందని అన్ని పార్టీల సభ్యులు సూచించడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అందుకు అనుమతించారు.

Rajya Sabha okays salary cut for MPs amid opposition