ఢిల్లీ : నవంబరు 18వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 13వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఈ సమావేశాలకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ లోక్‌సభ, రాజ్యసభ కార్యదర్శులకు షెడ్యూల్ పంపించింది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించనున్నారు. అదేవిధంగా పలు ఆర్డినెన్స్‌లు కూడా ఉభయ సభల్లో పెట్టనున్నారు.