Wednesday, April 24, 2024

జనవరి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు జరుగుతాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం తెలిపారు. కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న సమర్పిస్తారు. కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను(లోక్‌సభ, రాజ్యసభ) ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. అయితే ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కొత్త పార్లమెంటు భవనంలో మొదలవుతాయా లేక పాత పార్లమెంటు భవనంలోనే జరుగుతాయా అన్నది స్పష్టం కాలేదు.

‘బడ్జెట్ సమావేశం 2023 జనవరి 31 నుంచి మొదలయి ఏప్రిల్ 6 వరకు కొనసాగుతుంది. ఈ సమావేశంలో 27 సిట్టింగులు ఉండనున్నాయి. అవి 66 రోజులపాటు ఉంటాయి. కేంద్ర బడ్జెట్, ఇతర అంశాలు, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలు జరుగుతాయి’ అని పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోసి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News