Home అంతర్జాతీయ వార్తలు ప్రపంచంలో తొలిసారిగా పక్షికి అవయవ మార్పిడి

ప్రపంచంలో తొలిసారిగా పక్షికి అవయవ మార్పిడి

Bird1సావోపాలో: ఇదో రామచిలుక ‘గిజి’ కథ. చిలకమ్మ ముక్కు ఎంత ముచ్చటేస్తుందో అందరికీ తెలిసిందే. కానీ బ్రెజిల్ సావోపాలో నగరంలోని ఓ ఎస్టేట్‌లోని గిజి చిలక ముక్కు అసహజ రీతిలో పెరిగిపోయి దానికి చిక్కులు తెచ్చిపెట్టింది. టొమాటొ కూడా తినలేని పరిస్థితి చేరుకుంది. గిజి పరిస్థితికి చలించిపోయిన యూనిమోంటో యూనివర్శిటీలోని సెంటర్ ఫర్ రీసెర్చ్, స్క్రీనింగ్ ఆఫ్ విల్ యానిమల్స్ బృందం దానికి శస్త్ర చికిత్స చేశారు. గిజి ముక్కును తొలిగించి ప్లాస్టిక్ ముక్కుతో అవయవ మార్పిడి చేయాలని తొలుత భావించినా, గట్టిగా ఉన్న గింజలు తినేటప్పుడు పాస్టిక్ ముక్కు విరిగిపోతుందని గ్రహించారు. దీంతో సిసిరో మోరేయిస్ 3డి డిజైనింగ్ సంస్థను సంప్రదించి టైటానియం ముక్కు రూపొం దించారు. ఫిబ్రవరి 18న వైద్యులు గిజికి శస్త్ర చికిత్స నిర్వ హించి రంగురంగుల స్క్రూలతో ముక్కును అమర్చారు. రెండు రోజుల్లోనే కోలుకున్న గిజి ఇప్పుడు అన్ని గింజ లనూ బాగానే ఆరగిస్తోంది. ఈ విడియోను సోషల్ మీడి యాలో చూసిన పక్షిప్రేమికులు వైద్యులు, టైటానియం తో 3డి ముక్కు రూపొందించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇలా ఓ పక్షికి అవయవ మా ర్పిడి చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి మరి.