Home అంతర్జాతీయ వార్తలు బ్రెజిల్‌లో చిలుక అరెస్టు

బ్రెజిల్‌లో చిలుక అరెస్టు

Parrotబ్రెజిల్ : స్మగ్లర్లకు సహకరించిందన్న కారణంగా ఓ చిలుకను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బ్రెజిల్ లో జరిగింది. స్మగ్లర్లను పట్టుకునేందుకు పోలీసులు విఫలప్రయత్నాలు చేశారు. అయితే వారు మాత్రం పోలీసులకు చిక్కలేదు. ఓ ఇంట్లో నుంచి నిందితులు భారీ ఎత్తున కొకైన్ ను స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో స్మగ్లర్లను పట్టుకోవాలని పోలీసులు పక్కా పథకం పన్నారు. వెంటనే పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులు వస్తున్న విషయం స్మగ్లర్లు పసిగట్టలేదు. అయితే గుమ్మం దగ్గర పంజరంలో ఉన్న చిలుక మాత్రం పోలీసుల రాకను పసిగట్టింది. ’ మమ్మా … పోలీసు…‘ అంటూ అరిచింది. దీంతో అప్రమత్తమైన స్మగ్లర్లు వేరే ద్వారం ద్వారా పరారయ్యారు. చిలుక అరవడం వల్లనే స్మగ్లర్లు తప్పించుకున్నారని పోలీసులు నిర్ధారించారు. దీంతో చిలుకను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అనంతరం జరిగిన విచారణలో ఆ చిలుక నోరు విప్పలేదు. చిలుకను విడిచి పెట్టాలని పక్షి ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేయడంతో పోలీసులు సదరు చిలుకను స్థానికంగా ఉన్న జంతుప్రదర్శనశాలకు తరలించారు. ఎగిరేందుకు చిలుకకు శిక్షణ ఇచ్చి వదిలేస్తామని పోలీసులు తెలిపారు.

Parrot taken into Custody by Police in Brazil