Home తాజా వార్తలు నిన్న మహిళలు.. నేడు పురుషులు

నిన్న మహిళలు.. నేడు పురుషులు

China-Open
చైనా ఓపెన్ సింగిల్స్‌లో ముగిసిన భారత్ పోరు
రెండో రౌండ్‌లోనే నిష్క్రమించిన కశ్యప్, సాయిప్రణీత్

ఫుజౌ( చైనా): చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోరీసింగిల్స్ విభాగంలో భారత్ పోరు ముగిసింది.గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో భారత షట్లర్లు పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్ ఇద్దరూ ఓటమి పాలవడంతోర్టోర్నమెంటు సింగిల్స్ విభాగంలో భారత్ పోరు ముగిసినట్లయింది. పారునల్లి కశ్యప్ ఏడో సీడ్ విక్టర్ అక్సెల్‌సెన్ చేతిలో 21 13, 21 19తేడాతో వరసెట్లలో ఓటమి పాలయ్యాడు. కాగా మరో మ్యాచ్‌లో సాయి ప్రణీత్ నాలుగో సీడ్, డెన్మార్క్‌కు చెందిన ఆండర్స్ ఆంటన్‌సెన్‌తో మూడు సెట్లు హోరాహోరీ పోరాడి చివరికి 20 22, 22 20, 16 21స్కోరుతో ఓటమి పాలయ్యాడు. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన ప్రణీత్ రెండో గేమ్‌లో గెలిచి రేసులో నిలిచాడు.

అయితే హోరాహోరీగా జరిగిన మూడో గేమ్‌లో ప్రణీత్ తాను చేసిన తప్పులనుంచి తేరుకునే లోపే ప్రత్యర్థి మాచ్‌ని సొంతం చేసుకున్నాడు.ప్రణీత్ ఓటమితో సింగిల్స్‌లో భారత్ పోరు ముగిసినట్లయింది. బుధవారం మహిళల సింగిల్స్ పోరు ముగిస్తే ఈ రోజు పురుషుల సింగిల్స్ పోరు సైతం ముగిసింది. కాగా, మిక్స్‌డ్ డబుల్స్‌లో భారతీయ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, అశ్విని పొన్నప్ప జోడీ కూడా ఓటమి పాలయి టోర్నమెంటునుంచి నిష్క్రమించింది. కొరియాకు చెందిన అయిదో సీడ్ జోడీ సెవో సెయుంగ్ జే. చాయె య్జుంగ్ జోడీ చేతిలో భారత జోడీ 23 21, 21 16 స్కోరుతో ఓటమి పాలయింది. అయితే మహిళల డబుల్స్‌లో మాత్రం సాత్విక్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ ఆరో సీడ్ జపాన్‌కు చెందిన హిరోయుకి ఎండో, యుటా వతనబెలపై 21 18, 21 23, 21 11 స్కోరుతో అద్భుత విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. శుక్రవారం క్వార్టర్ ఫౌనల్లో ఈ జోడీ చైనాకు చెందిన లియు జున్ హుయి, లియు యు చెన్ జోడీతో తలపడుతుంది.

Parupalli Kashyap Sai Praneeth knocked out of China Open