Home తాజా వార్తలు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన

Shamshabad-air-port2హైదరాబాద్: విమానం రావల్సిన సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆందోళనకు దిగారు. ఉదయం 5.30 గంటలకి ముంబయికి వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం ఇప్పటికీ రాకపోవడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. గడిచిన నాలుగు గంటలుగా విమానాశ్రయంలోనే ఉన్న ప్రయాణికులు ఆగ్రహంతో ఆందోళన బాటపట్టారు. అయితే విమానంలో సాంకేతికలోపం ఏర్పడటంతోనే విమానం ఆలస్యమైనట్లు తెలుస్తోంది.