Friday, March 29, 2024

విమానంలోనే ప్రయాణికుడు మృత్యువాత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విదేశాల నుండి స్వదేశానికి వస్తూ విమానంలోనే గుండెపోటుకు ఓ వృద్ధుడు గురయ్యాడు. విమానం ఆకాశంలో వుండగా వృద్దుడికి గుండె నొప్పి మొదలై సకాలంలో సరైన వైద్యం అందకపోవడంతో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యేసరికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. తెలిసిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా నిడదవోలుకు చెందిన చెక్కా నూకరాజు (85) కుటుంబంతో కలిసి దుబాయ్‌లో స్థిరపడ్డాడు. అయితే త్వరలో బంధువుల ఇంట వివాహం వుండటంతో అతడు భార్యా కొడుకుతో కలిసి స్వదేశానికి బయలుదేరాడు. సోమవారం షార్జా విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం ఎక్కిన వీరు గన్నవరం విమానాశ్రయంలో మరికొద్దిసేపట్లో దిగతారనగా నూకరాజుకు ఛాతిలో నొప్పి మొదలయ్యింది.

Also Read: భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు స్వాధీనం..

విమానం గాల్లో వుండగానే నూకరాజు గుండెలో నొప్పితో బాధపడగా సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. గన్నవరం విమానాశ్రయ అధికారులకు నూకరాజు పరిస్థితిపై ముందుగానే సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్‌ను రెడీగా వుంచారు. కానీ విమానం గన్నవరంలో ల్యాండ్ అయ్యేలోపే నూకరాజు ప్రాణాలు కోల్పోయాడు. వైద్యసిబ్బంది అతడిని పరిశీలించి చనిపోయాడని నిర్దారించారు. పెళ్లి కోసమని బయలుదేరిన నూకరాజు ఇలా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబంలో విషాదాన్ని నింపింది. అతడి మృతదేహాన్ని స్వగ్రామం నిడదవోలులోనే అంత్యక్రియలు నిర్వహించారు. కొన్నేళ్ల కింద విదేశాలకు వెళ్లిన నూకరాజు ఇలా మృతదేహంగా తిరిగిరావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News