Home తాజా వార్తలు జోరందుకున్న వాహన విక్రయాలు

జోరందుకున్న వాహన విక్రయాలు

Passenger vehicle sales in India rise 17% in Sept

 

సెప్టెంబర్‌లో 17% పెరిగిన ప్యాసింజర్ వాహన సేల్స్
20 శాతం పడిపోయిన వాణిజ్య వాహన విక్రయాలు

ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) సెప్టెంబర్ నెలలో ప్యాసింజర్ వాహనాల సేల్స్ 26.45 శాతంతో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. ప్యాసింజర్ వాహన విక్రయాలు 3,67,696 యూనిట్ల నుంచి 4,26,316 యూనిట్లకు అంటే 17 శాతం వృద్ధిని సాధించాయి. ఈమేరకు ఇండస్ట్రీస్ బాడీ సియామ్ (భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంస్థ) శుక్రవారం గణాంకాలను విడుదల చేసింది. మొత్తానికి పండగ సీజన్ వాహన తయారీదారులకు ఊరటనిస్తోంది. ప్యాసింజర్ టోకు విక్రయాలు 2.15 లక్షల యూనిట్ల నుంచి 2.72 లక్షల యూనిట్లకు పెరిగాయి. కారు విక్రయాలు 1.63 లక్షల యూనిట్లతో 28.9 శాతం వృద్ధిని సాధించగా, గతేడాది ఈ సేల్స్ 1.27 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. అలాగే యుటిలిటీ వెహికిల్స్ 96,633 యూనిట్లతో 24.5 శాతం, వ్యాన్ల విక్రయాలు 11,413 యూనిట్లతో 10.64 శాతం పెరిగాయి.

సియామ్ అధ్యక్షుడు కెనిచి అయుకావ మాట్లాడుతూ, కోవిడ్ 19 సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఉత్పత్తి, విక్రయాలను పెంచుకునేందుకు దేశీయ వాహన పరిశ్రమ చాలా కష్టపడింది. కస్టమర్ల, ఉద్యోగుల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని పరిశ్రమలు పలు చర్యలు చేపట్టిందని అన్నారు. రెండో త్రైమాసికంలో కోలుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్యాసింజర్, ద్విచక్ర వాహన అమ్మకాలు సానుకూలంగా ఉన్నాయని అన్నారు. నేటి నుంచి ప్రారంభం కానున్న పండగ సీజన్‌లో మంచి డిమాండ్‌ను ఆశిస్తున్నామని కెనిచి అన్నారు.

టూవీలర్ సేల్స్
ద్విచక్ర వాహన విక్రయాలు గతేడాదిలో 16.56 యూనిట్లు ఉండగా, ఈ ఏడాది 18.49 యూనిట్లతో 11.64 శాతం వృద్ధిని సాధించాయి. వార్షికంగా మోటార్‌సైకిళ్ల విక్రయాలు 12.24లక్షల యూనిట్లతో 17.30 శాతం వృద్ధి నమోదు చేశాయి.

వాణిజ్య వాహన విక్రయాలు
వాణిజ్య వాహన విక్రయాల విషయంలో నిరాశ ఎదురైంది. వాణిజ్య వాహన సేల్స్ 2020 జులై సెప్టెంబర్‌లో 1.33 యూనిట్లను విక్రయించగా, గతేడాది 1.67 యూనిట్లు సేల్ అయ్యాయి. అంటే వాణిజ్య వాహన విక్రయాలు 20.13 శాతం పడిపోయాయి. గత నెలలో త్రీవీలర్ అమ్మకాలు ప్రతికూల జోన్‌లోనే ఉన్నాయి. వీటి సేల్స్ 66,362 యూనిట్ల నుంచి 18,640 యూనిట్లకు అంటే 72 శాతం పడిపోయాయి.

Passenger vehicle sales in India rise 17% in Sept