Home తాజా వార్తలు పండుగ విక్రయాలు కలిసొచ్చాయి

పండుగ విక్రయాలు కలిసొచ్చాయి

Passenger vehicles

 

అక్టోబర్‌లో ప్రయాణికుల వాహనాల సేల్స్ 0.28% జంప్

న్యూఢిల్లీ: ఈ సారి పండుగ సీజన్ విక్రయాలు ప్రయాణీకుల వాహనాల అమ్మకాల వృద్ధికి దోహదం చేశాయి. దేశీయ అమ్మకాలు అక్టోబర్‌లో 0.28 శాతం పెరిగి దాదాపు 2,85,27 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో 2,84,223 యూనిట్లు ఉన్నాయి. గత 12 నెలల్లో మొదటిసారిగా ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు పెరిగాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు (సియామ్) సోమవారం ఆటో అమ్మకాల గణాంకాలను విడుదల చేశారు. నవంబర్, డిసెంబర్‌లలో కూడా అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.

మోటారుసైకిల్ సేల్స్‌లో 16% క్షీణత
యుటిలిటీ వాహనాలు, చిన్న కార్లు, రవాణా వాహనాలు మినహా అన్ని రకాల వాహనాలు క్షీణించాయి. గత నెలలో మొత్తం కార్ల అమ్మకాలు 6.34 శాతం పడిపోయి 1,73,649 యూనిట్లకు చేరుకున్నాయి. అక్టోబర్ 2018లో 1,85,400 ప్రయాణీకుల వాహనాలు అమ్ముడయ్యాయి. గత నెలలో మోటారుసైకిల్ అమ్మకాలు 15.88 శాతం తగ్గి 11,16,970 యూనిట్లకు చేరుకున్నాయి. మోటారు సైకిళ్ల మొత్తం అమ్మకాలు 14.43 శాతం తగ్గాయి. 2018 అక్టోబర్‌లో అమ్మకాలతో పోలిస్తే (20,53,497 యూనిట్లు) ఇది 17,57,264 యూనిట్లు. వాణిజ్య వాహనాల అమ్మకాలు గత నెలలో 23.31 శాతం క్షీణించాయి.

Passenger vehicle sales up 0.28% in October