Home తాజా వార్తలు తృటిలో తప్పిన పెను ప్రమాదం

తృటిలో తప్పిన పెను ప్రమాదం

 RTC Bus Accident

 

సోన్‌ : నిజామాబాద్ నుండి నిర్మల్ వైపు వస్తున్న ఆర్టీసి అద్దె బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎస్సై రవీందర్, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం… నిజామాబాద్ నుండి నిర్మల్ వైపు వస్తున్న ( ఎపి01టిఎ 1008) నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసి అద్దె బస్సు సోన్ మండలంలోని గంజాల్ టోల్‌ఫ్లాజ్ వద్ద అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీ కొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే స్పందించిన స్థానికులు హైవే రోడ్డు అంబులెన్స్‌తో పాటు ఏరియా ఆసుపత్రి అంబులెన్స్‌లకు సమాచారం అందిచగా క్షతగాత్రులను నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సును డ్రైవర్ మనోహార్ అతీ వేగంగా నడుపడంతో అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ ప్రమాదంలో ఒకరికి కాలు విరుగగా మరో 15 మందికి తీవ్ర గాయాలు కాగా మరో నలుగురికి స్వల్ప గాయాలు అయినట్లు సూపరిండెంట్ డాక్టర్ సురేష్ తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై రవీందర్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.. డ్రైవర్ అతీ వేగంగా బస్సును నడుపడం వలనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు డ్రైవర్ పై తీవ్ర ఆగ్రహించారు. బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి బస్సులు నడపాలని స్థానికులు కోరుతున్నారు.

Passengers injured in RTC Bus Accident