Thursday, April 18, 2024

మద్యం ప్రియులకు లిక్కర్ కొనుగోలుకు ప్రభుత్వం పాస్‌లు

- Advertisement -
- Advertisement -

Liquor

 

తిరువనంతపురం : మద్యానికి బానిసైన వారికి లిక్కర్ కొనుగోలుకు కేరళలో స్పెషల్ పాస్‌లు ఇవ్వనున్నారు. అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పైనే వీరికి మద్యం లభిస్తుంది. మద్యం దొరక్క కొందరు నిస్పృహకు గురై ఆత్మహత్యకు పాల్పడడం వంటి సామాజిక సమస్యలు తలెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్టుమెంట్ నుంచి పరిమితి విధానంలో కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది . ప్రభుత్వ నిర్ణయానికి వైద్య రంగం తీవ్రంగా విమర్శించింది.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ)కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టింది.లాక్‌డౌన్ ఫలితంగా లిక్కర్ షాపులన్నీ మూతపడడంతో మద్యానికి బానిసైన ముగ్గురు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి సంఘటనలు కర్నాటక, తెలంగాణల్లో కూడా జరిగినట్టు వార్తలు వచ్చాయి. మద్యం లేక అవలక్షణాలను ఎదుర్కొంటున్న వారు ప్రజారోగ్య కేంద్రాలకు, ఆస్పత్రులకు వెళ్లి పరీక్ష చేయించుకోవాలని కూడా ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. అటువంటి వ్యక్తులు డాక్టర్ నుంచి ప్రిస్క్రప్షన్ పొందితే వారికి పరిమితిపై లిక్కరు లభిస్తుందని వివరించింది.

తెలంగాణలో
తెలంగాణలో కూడా మద్యం దొరక్క బాధపడుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ లోని ఎర్ర గడ్డ మానసిక చికిత్స వైద్య కేంద్రంలో 250 కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా లిక్కర్ దొరక్క మద్యం బానిసలు మాంద్యంగా, నిద్రలేక, విశ్రాంతిలేక, అపస్మారకంగా, పిచ్చిగా, దౌర్జన్యంగా ఇలా అనేక రకాలుగా ప్రవర్తిస్తున్నట్టు బయటపడింది. గత శుక్రవారం హైదరాబాద్‌లో మద్యం దొరక్క 50 ఏళ్ల దినసరి కూలీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

అస్సోం, కర్నాటకలో
అస్సోం జొర్హాట్ జిల్లాలో సోమవారం స్పిరిట్ తాగి ఒకరు చనిపోగా, మిగతా వారు చావు బతుకుల్లో ఉన్నారు. కర్నాటకలో లాక్‌డౌన్ ఫలితంగా ఆదివారం లిక్కర్ దొరక్క ఒక వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

Passes for Tipplers to Get Liquor During Curfew
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News