Tuesday, April 23, 2024

పాస్‌పోర్టులు సీజ్ చేసిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

Passports

 

– రాచకొండలో 991,
– సైబరాబాద్‌లో 881 సీజ్
– నిబంధనలు ఉల్లంఘిస్తే
– కేసులు నమోదు చేస్తాం
– ముగ్గురు పోలీస్ కమిషనర్ల హెచ్చరిక

మన తెలంగాణ/సిటిబ్యూరో: విదేశాల నుంచి వచ్చిన వారి పాస్‌పోర్టులను రాచకొండ, సైబరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో చాలా మంది క్వారంటైన్‌కు వెళ్లేందుకు తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారు నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో 881, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 99 1 పాస్‌పోర్టులు సీజ్ చేశారు. జనవరి నుంచి పలు దేశా ల నుంచి జిహెచ్‌ఎంసి పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు వచ్చారు. వారిలో చాలామంది హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. వారిలో చాలా మంది పాస్‌పోర్టులను సీజ్ చేశారు పోలీసులు, అయినా కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే కేసు లు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కే సులు నమోదు చేస్తే విదేశాలకు వెళ్లే అవకాశం ఉండద ని పోలీసులు స్పష్టం చేశారు.

అలాగే పాస్‌పోర్టుల్లో ఉ న్న చిరునామాల్లో చాలామంది లేరని వారు కొత్త చిరునామాల్లో ఉన్నారని వారి ఆచూకీ లభించడంలేదని పో లీసులు తెలిపారు. వారు వెంటనే హోం క్వారంటైన్‌లో ఉండాలని లేదంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న క్వారంటైన్లకు రావాలని కోరుతున్నారు. అలా కాకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ బయట తిరిగితే కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీ స్ కమిషనర్లు స్పష్టం చేశారు. ఇందులో చాలామందిని గుర్తించి వారి కదలికలపై నిఘాపెట్టామని పోలీసులు తెలిపారు.

హైదరాబాద్‌లో 12,000మంది హోం క్వా రంటైన్‌లో ఉన్నారని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. వారు బయటికి రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1800మందికి పైగా గుర్తించామని సి పి మహేష్ భగవత్ తెలిపారు. క్వారంటైన్‌లో ఉన్న వా రిపై నిఘాపెట్టామని, హోం క్వారంటైన్‌లో ఉన్న వారు నిబంధనలు పాటించకుండా బయటికి వస్తే రాజేంద్రనగర్‌లోని క్వారంటైన్‌కు తరలిస్తున్నట్లు సైబరాబాద్ పో లీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు.

 

Passports Seized by Police
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News