Sunday, March 26, 2023

పాతగుట్టలో అధ్యయనోత్సవాలు

- Advertisement -

god

మనతెలంగాణ/యాదాద్రి: శ్రీ లక్ష్మినరసింహ స్వామి అనుబంధఆలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రోజు న మూడవ రోజు అధ్యయనోత్సవాల్లో భాగం గా శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చ క స్వాములు, వేద పండితులు ప్రత్యేక పూజలను నిర్వహించి శాస్త్రోక్తంగా వేడుకను సాగించారు. ఉదయం తెల్లవారుజామునే ఆలయా న్ని తెరచి సుప్రభాత సేవ అభిషేక పూజల అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి వేద మంత్రాలను ఉఛ్ఛరిస్తు శ్రీ స్వామి వారి తిరుమంజనము పరమపద ఉత్సవంను నిర్వహించారు. మేళ తాళల మధ్య స్వామి వారి సేవను ఆలయ వీధుల్లో ఊరేగించి సేవ విశిష్ఠతను అర్చక స్వాములు భక్తులకు తెలియచేశా రు. ఈ అధ్యయనోత్సవాల్లో ఆలయ అధికారు లు, అర్చక స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి నిత్యరాబడి 10.05 లక్షలు
శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదా ద్రి క్షేత్రంలో స్వామివారి ఆలయం నిత్యరాబ డి భాగంగా సోమవారం రోజున 10 లక్షల 05 వేల 144 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి దేవస్థానంలో ప్రధాన బుకింగ్ వ్రతపూజలు, అతిశ్రీఘ్ర దర్నం కల్యాణ కట్ట, విచారణ శాఖ, ప్రసాదవిక్రయం, టోల్‌గేట్, శాశ్వత పూ జలు, అన్నప్రసాదం, వాహన పూజలతో పా టు అనుభంద ఆలయమైన పాతగుట్ట దేవాల యం, వివిధ శాఖల నుండి స్వామివారి నిత్యరాబడి సమకూరినట్లు తెలిపారు.
యాదాద్రిలో డీజీపీ పూజలు
శ్రీ లక్ష్మినరసింహ స్వామి యాదాద్రి క్షేత్రం లో రాష్ట్ర డీజీపీ మహెందర్‌రెడ్డి స్వామి వారిని దర్శించుకొని పూజలను నిర్వహించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా భద్రత పరమైన అంశాలపై పరిశీలన చేసేందుకు సోమవారం రోజున డిజిపి యాదాద్రికి చేరుకున్నారు. ఆలయానికి వచ్చిన డిజిపికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా స్వామి దర్శనం పూజలు నిర్వహించిన ఆయనకు అర్చక స్వాములు స్వామి వారి ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలను అందచేశారు. అనంతరం డీజీపీ యాదాద్రి ఆలయ పునర్మిణాన పనులను పూర్తి స్థాయిలో పరిశీలించి మాట్లాడారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా భద్రత పరమైన చర్యలు పరిశీలించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ మహక్షేత్రానికి పూర్తి స్థాయి భద్రత చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట కమీషనర్ మహేశ్‌భగవత్, కలెక్టర్ అనితరామచంద్రన్, డిసిపి రాంచంద్రారెడ్డి, సిఐలు అంజయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News