Home తాజా వార్తలు ప్రత్యర్థిని దూషించిన పాటిన్సన్ ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు

ప్రత్యర్థిని దూషించిన పాటిన్సన్ ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు

Pattinson

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేమ్స్ పాటిన్సన్‌కు భారీ షాక్ తగిలింది. గత వారం విక్టోరియాకు చెందిన షెఫీల్డ్ ఫీల్డ్, క్వీన్స్‌లాండ్ మధ్య మ్యాచ్ సందర్భంగా పాటిన్సన్ ప్రత్యర్థి ఆటగాడిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. విక్టోరియాకు ప్రాతినిధ్యం వహించిన పాటిన్సన్ ఫీల్డింగ్ సందర్భంగా ఆ ఆటగాడిని వ్యక్తిగతంగా దూషించాడు. గత 18 నెలల్లో పాటిన్సన్ ఇలా వ్యవహరించడం ఇది మూడో సారి. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రవర్తనా నియమావళి(కోడ్ ఆఫ్ కాండక్ట్)ను ఉల్లంఘించినందుకుగాను పాటిన్సన్‌పై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది.

ఫలితంగా ఈ వారంలో పాకిస్తాన్‌తో జరగనున్న తొలి టెస్టుకు జట్టునుంచి అతడిని తొలగించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన సీన్ కరోల్ తెలిపారు. పాటిన్సన్‌పై నిషేధంతో మిచెల్ స్టార్క్‌లకు జట్టులో స్థానం లభించింది. గురువారం బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ల మధ్య గురువారంనుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. కాగా తన తప్పును పాటిన్సన్ అంగీకరించాడు. తాను తప్పుగా ప్రవర్తించినట్లు గుర్తించిన వెంటనే అంపైర్లకు, ప్రత్యర్థి ఆటగాడికి క్షమాపణలు చెప్పినట్లు తెలిపాడు.

Pattinson suspended