Home Default ఎకనామిక్స్ లో ఇద్దరికి నోబెల్ బహుమతి

ఎకనామిక్స్ లో ఇద్దరికి నోబెల్ బహుమతి

Paul And Robert Win Nobel Prize In Economicsస్టాక్‌హోమ్ : ఎకనామిక్స్ లో 2020కి గాను ఇద్దరిని నోబెల్ బహుమతి వరించింది. వేలం విధానంలో మార్పులు, నూతన వేలం విధానాలను రూపొందించినందుకు గాను  ఆర్థిక వేత్తలు  పౌల్ ఆర్ మిల్‌గ్రామ్‌, రాబ‌ర్ట్ బీ విల్స‌న్‌ల‌ను నోబెల్ బహుతులు వరించాయి.  స్టాక్‌హోమ్‌లో నోబెల్ క‌మిటీ వీరికి ఈ నోబెల్ బహుతిని  ప్ర‌క‌టించింది. వేలం అనేది ప్రజల రోజువారి జీవితాలపై ప్రభావం చూపిస్తుందని, పౌల్ మిల్‌గ్రామ్‌, రాబ‌ర్ట్ విల్స‌న్‌లు కనుగొన్న కొత్త వేలం విధానంతో అమ్మకందారులు, కొనుగోలుదారులు, పన్నుదారులకు ఎంతో మేలు చేస్తుందని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది. రేష‌న‌ల్ బిడ్డ‌ర్ల గురించి విల్స‌న్‌,  బిడ్డింగ్‌లో పాల్గొన్న‌వారిలో ఉండే వ్య‌త్యాసాల గురించి పాల్ మిల్‌గ్రామ్ కొత్త ఫార్మాట్ల‌ను త‌యారు చేశారు. ఈ క్రమంలోనే వీరికి ఈ ఏడాదికి గాను నోబెల్ బహుతి లభించింది. ఎకనామిక్స్ లో నోబెల్ బహుమతి పొందిన వీరిని  పలువురు ఆర్థికవేత్తలు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.